రాష్ట్రీయం

నిజాలంకరణలో భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 1: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం భ్రమరాంబిక అమ్మవారు నిజాలంకరణ రూపంలో, స్వామి అమ్మవార్లు నందివాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. అనంతరం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం లోపల ఉన్న శమి వృక్షం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాటితో దసరా మహోత్సవాలు ముగిసాయి. కాగా డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి దంపతులు శనివారం స్వామి అమ్మవార్లను దర్శించుకుని, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.
భక్తులకు ఉచిత వైఫై
శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం ఉద్యానవన విభాగం కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ఈఓ నారాయణభరత్‌గుప్తా చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో పాటు దేవస్థానం పెంచుతున్న భ్రామరి పుష్పవనం విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఉచిత వైఫై సేవలను ఈఓ ప్రారంభించారు.