బిజినెస్

ఎంపెడా మార్కెటింగ్ డైరెక్టర్‌గా డోలా శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 4: సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధిసంస్థ (ఎంపెడా)లో కీలకమైన మార్కెటింగ్ విభాగానికి నేతృత్వం వహించే అవకాశం తొలిసారిగా తెలుగువారికి దక్కింది. దేశీయంగా జరిగే ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే సింహభాగం అనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగానికి సుపరిచితులైన కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసి టి డోలాశంకర్ కొచ్చిన్‌లోని ఎంపెడా కేంద్ర కార్యాలయం మార్కెటింగ్ డైరక్టర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసు 2001 బ్యాచ్‌కు చెందిన డోలాశంకర్ అంచలంచెలుగా ఎదిగి, సీనియర్ శాస్తవ్రేత్తగా మంచి గుర్తింపుపొందారు. దేశంతోపాటు విదేశాల్లో పర్యటించి అనేక పరిశోధనలు చేశారు. ఆక్వా రంగంలో ఉత్పత్తితోపాటు మార్కెటింగ్ చాలాకీలకమైంది. అటువంటి ఎంపెడా మార్కెటింగ్‌కి ఆయన డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతుండగా, 2022 నాటికి 10 బిలియన్ డాలర్లుకు చేర్చడమే లక్ష్యమని డోలాశంకర్ ఫోన్‌లో విలేఖర్లకు చెప్పారు. ఆక్వా ఫామ్స్, ఫీడ్, ప్రోసెసింగ్ యూనిట్స్ వంటి వాటిని విసృతంచేసి, రైతాంగానికి మరింత అండగా ఉంటామన్నారు.