రాష్ట్రీయం

విత్తన సామర్థ యం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 9: కర్నూలు జిల్లా నుంచి ప్రపంచంలో ఏ దేశానికి అవసరమైనా విత్తనాలను ఎగుమతి చేయగల శక్తిని సాధించగలిగామని సిఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగెడంచ వద్ద నిర్మించనున్న ప్రపంచస్థాయి విత్తన పరిశోధనా సంస్థకు సోమవారం శంఖుస్థాపన చేశారు. అమెరికాకు చెందిన అయోవా వర్శిటీ, రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీ భాగస్వామ్యంతో 623 ఎకరాల్లో రూ.670 కోట్లతో విత్తన పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి అవసరమైన విత్తనాలనయినా ఉత్పత్తి చేసే సత్తా ఉన్న భూములు కర్నూలులో ఉన్నాయని గుర్తించి ఇక్కడే పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వాతావరణం, సాగునీరు, సారవంతమైన భూములు ఉన్న తంగెడంచలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు, పరిశోధకులు విత్తన పరిశోధన చేయడానికి అవసరమైన అన్ని వౌళిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సంస్థలో విత్తన పరిశోధన, విత్తనశుద్ధి, విద్యార్థి దశలో ఉన్న వారికి నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యవసాయ శాస్తవ్రేత్తలు, విత్తన పరిశోధనలు చేస్తున్న నిపుణులు, విద్యార్థులు తంగెడంచలో నూతన విత్తనాలను ఉత్పత్తి చేస్తారన్నారు. దీని కారణంగా ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి చూపుతుందని తెలిపారు. గత పాలకుల వైఫలం కారణంగా రైతులకు నాశిరకం విత్తనాలు పంపిణీ అయ్యాయన్నారు. సాగునీటి పారుదలలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పచ్చని పంటలతో కళకళలాగే కోనసీమలో సైతం రైతులు పంట విరామం ప్రకటించే స్థాయికి వచ్చారంటే గత పాలకులు వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో అర్ధమవుతోందని అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, అవసరమైన సమయంలో సాగునీరు అందిస్తే చాలని వారు అద్భుతాలు సృష్టించగలరని అన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దీని వల్ల నష్టాల బారినుంచి గట్టెక్కడానికి వీలుంటుందని తెలిపారు. నాణ్యమైన విత్తనం అంటే అధిక ఉత్పత్తులు అందజేయడం కాదని అన్ని రకాల చీడ, పీడలను తట్టుకోగలిగిన శక్తి విత్తనానికి ఉండాలని ఆయన అన్నారు. తంగెడంచలో పూర్తి సత్తా ఉన్న వందల రకాల విత్తనాలు ఉత్పత్తి కానున్నాయని ఆయన తెలిపారు. తంగెడంచలోనే కాకుండా నంద్యాల ప్రాంతంలోని విత్తన పరిశోధనా సంస్థకు చెందిన భూముల్లో కూడా విత్తన పరిశోధనను చేపడతామని తెలిపారు. విత్తన ఉత్పత్తి కోసం జిల్లాలో వందల పరిశ్రమలు తీసుకురావాలన్న ఆలోచన తనకుందని ఆయన తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో అమెరికాలో పర్యటించనున్నానని అక్కడి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలన్న సంకల్పంతో వెళ్తున్నానని తెలిపారు. దేశానికి యువ శక్తి అవసరం ఎంతో ఉందని వారికి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపిస్తే వారు తమ సత్తా చూపిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కాలువ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, అమెరికాకు చెందిన అయోవా వర్శిటీ ప్రతినిధులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం ప్రతినిధులు పాల్గొన్నారు.