ఆంధ్రప్రదేశ్‌

4000 పంచాయితీ కార్యదర్శుల భర్తీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న 4000 పంచాయితీ కార్యదర్శుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వారంలో రోజుల్లో ఖరారు చేసి, సిఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 350 సర్పంచ్ స్థానాలకూ కూడా త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో గ్రామాల్లో చెత్త కుప్పలు లేకుండా చూడాలని సిఎం ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటు, కంపోస్టు తయారీపై దృష్టి సారించామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి గ్రామాల్లో చెత్త కనబడకుండా చేస్తామన్నారు. కంపోస్టు ద్వారా పంచాయితీలకు ఆదాయం లభిస్తుందని, ప్రస్తుతం పంచాయితీలకు వివిధ రూపాల్లో 550 కోట్ల రూపాయలు వస్తున్నదని, దీనిని 1000 కోట్ల రూపాయలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంపోస్టును హార్టికల్చర్, అటవీ శాఖ కొనుగోలు చేసేలా ఇప్పటికే సిఎం ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. చెత్త సేకరణను కూడా డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 2019 నాటికి కనీసం 50 శాతం పంచాయితీల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసి, ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నిధులు 4500 కోట్ల రూపాయల వరకూ కేంద్రం సమకూరుస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు ఉంటాయని, లింక్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి అవుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో వివిధ శాఖల అనుసంధానం ద్వారా 4500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. వచ్చే అక్టోబర్ 2 నాటికి గ్రామాల్లో ఎల్‌ఇడి వీధి దీపాల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ప్రతి 30 మీటర్లకు ఒక విద్యుత్ స్తంభం ఉండాలని, ఈ మేరకు అదనంగా నాలుగు లక్షల స్తంభాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నామన్నారు.
నరేగా నిధులు అడ్డుకున్నారు
కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులు రాకుండా ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. పారదర్శకంగా పనులు చేస్తున్నా, నిధులు రాకుండా అడ్డుకోవడంపై ప్రజలకు వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేగా నిధులు ఇతర పనులకు మళ్లిస్తున్నారని, యంత్రాలు వినియోగిస్తున్నారని కేంద్రానికి వైకాపా ఎంపిలు అవినాష్ రెడ్డి, సుబ్బారెడ్డి లేఖలు రాయడంపై ఆయన స్పందిస్తూ ఈ లేఖల కారణంగా 630 కోట్ల రూపాయల మేర వేతనాలు చెల్లించలేని పరిస్థితి మూడు నెలలుగా నెలకొందన్నారు. ఈ లేఖలపై కేంద్ర బృందాలు వచ్చి పరిశీలన చేశాయన్నారు. పనులు అన్నీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.