రాష్ట్రీయం

హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. నవంబర్ 28 నుండి మూడు రోజుల పాటు అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జిఇఎస్) హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వం, యుఎస్‌లకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం రెండు సార్లు సమావేశం కాగా, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అమెరికా బృందం త్వరలో హైదరాబాద్ రానుంది. హైటెక్స్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగే ఈ శిఖరాగ్ర సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌లు ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ప్రముఖులు, ఇనె్వస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌లో భేటీ అవుతారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు వెల్లడించడం, పరస్పరం భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం, నిధులను సమకూర్చుకోవడంతో పాటు సమాజ పరివర్తనకు బాట వేసే కొత్త కొత్త వస్తువులు, సేవలను ఆవిష్కరించడం కోసం నెట్ వర్కింగ్ , మెంటరింగ్, వర్కుషాప్‌ల ద్వారా ఈ శిఖరాగ్ర సదస్సు వారికి వేదిక కాబోతోంది. ఈ ఏడాది సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలపైన , ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల లోకానికి అండగా నిలిచే సామర్ధ్యం ఉన్న మహిళలపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల స్ఫూర్తిని , దానికి సంబంధించిన పూర్తి శక్తియుక్తులను , వైవిధ్యాన్ని కళ్లకుకట్టే విధంగా ‘ మహిళలకు తొలి ప్రాధాన్యం- అందరికీ సంపద’ అనే ఇతివృత్తాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించడంలో భారత ప్రభుత్వం పక్షాన నీతి ఆయోగ్ ముఖ్య పాత్రను పోషించనుంది. శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు తొలుత తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడంతో హైదరాబాద్ వేదికగా మారింది. విశాల జన బాహుళ్యం మేలు కోసం ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం, విద్య, శక్తి, సురక్షితమైన తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల్లో కొన్నింటిపైనా పరిష్కరించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ దిశగా గమ్యాన్ని చేరుకునేందుకు నూతన ఆవిష్కరణలు , ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కృషి నిర్ణాయకమైన పాత్రను పోషిస్తుందని నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. మహిళలు సాధికారత సాధించుకుంటేనే సముదాయాలు, దేశాలు వర్ధిల్లుతాయని ఆయన చెప్పారు. వర్కుషాప్‌లతో పాటు నెట్‌వర్కింగ్ సమావేశాలు కూడా హైదరాబాద్‌లో జరుగుతాయి.