రాష్ట్రీయం

ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ కట్ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ప్రాధాన్యత ఉండటం వల్ల విద్యార్థులపై ఎక్కువ ఒత్తిడి ఉంటోందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ర్యాంక్‌లు కాకుండా గ్రేడింగ్ విధానం తీసుకువచ్చే అలోచన కూడా ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రంగా కలచివేసే అంశమన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలను కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ నెల 16న కళాశాలల యాజమాన్యాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థుల సమస్యల కోసం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే
కళాశాలలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. 158 హాస్టళ్లు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని, మూడు నెలల్లోగా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేయాలని, లేకుంటే రద్దు చేస్తామన్నారు. నిబంధనలు పాటించకపోతే నారాయణ అయినా, చైతన్య అయినా వదిలేదని లేదని స్పష్టం చేశారు. కళాశాలల యాజమాన్యాలు నిబంధనల ఉల్లంఘనలో ఇంటర్ బోర్డు అధికారుల వైఫల్యం కూడా ఉందన్నారు. విజయవాడలో ఒక ఇంటర్ విద్యార్థి అత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో తరచూ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ నెల 15న ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 6500 మంది విద్యార్థులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశామన్నారు. పాఠశాల విద్యలో 3991, ఇంటర్‌కు సంబంధించి 507 మందిని ఎంపిక చేశామన్నారు.

చిత్రం.. మంత్రి గంటా శ్రీనివాసరావు