రాష్ట్రీయం

ఆంధ్రకు వచ్చేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్ర విభజన జరిగి మూడున్నర సంవత్సరాలు దాటుతున్నా ఉద్యోగుల్లో రాష్టస్థ్రాయి క్యాడర్ పోస్టుల విభజన, ఆస్తుల పంపిణీ అంశాలు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇక జోనల్, జిల్లా స్థాయిలో పనిచేసే వారి బదిలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డిఎస్సీలో ఓపెన్ కేటగిరీ 20 శాతం కింద తెలంగాణ జిల్లాల్లో నియమితులైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 500 మంది ఉపాధ్యాయులు ఏదోవిధంగా తమ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీరిలో పలువురు ఓ బృందంగా ఏర్పడి అధికార పక్ష నేతల కార్యాలయాలు, ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ విన్నపాలు చేసుకుంటున్నారు. ఆదివారం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు జలీల్ ఖాన్, బొండా ఉమామహేశ్వరరావుల వద్దకెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో ఏపిలో నియమితులైన దాదాపు 270 మంది టీచర్లు తెలంగాణ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వీరు చెబుతున్నారు. ఇక తెలంగాణలో పనిచేస్తున్న ఏపికి చెందిన టీచర్ల బాధలు వర్ణనాతీతం. ఇక్కడ వృద్ధాప్యంలో వున్న వీరి తల్లిదండ్రుల వైద్యానికి వారి తెలంగాణ హెల్త్‌కార్డులు ఇక్కడ పనిచేయడం లేదు. అత్యవసర సమయాల్లో రాలేకపోతున్నారు. తమ పిల్లలు సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులయ్యే ప్రమాదం ఉందని భావిస్తూ ఇక్కడ బంధువుల ఇళ్లల్లో, లేదా హాస్టళ్లలో వుంచి చదివిస్తున్నారు.
ఇక తెలంగాణాలో పనిచేస్తున్న స్థానికేతర టీచర్లలో అత్యధికులు బిసిలు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఏపికి చెందిన 26 బిసి కులాలను ఓసీలో చేర్చింది. దీనివల్ల తమ పిల్లలు రిజర్వేషన్లు కోల్పోతారని వీరు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉండలేక రెండేళ్లలోనే తరలివచ్చిన పాలకులు సామాన్యులమైన తమ ఇబ్బందులు పట్టించుకోవాలని, తాము జీవితాంతం అక్కడ ఎలా ఉండగలమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.