రాష్ట్రీయం

శ్రీశైలం మూడు గేట్లు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 15: శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,09,912 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయగా ఆదివారం మూడు గేట్లను మూసివేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 883.7 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 208.2841 టిఎంసిలుగా నమోదైంది. మొత్తం మీద జలాశయం నుంచి 1,98,337 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ నుంచి జలాశయంలోకి 1,28,460 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,15,752క్యూసెక్కులు, రోజా ప్రాజెక్టు నుంచి 8,958క్యూసెక్కులు, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఇక మొదటి పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,972 క్యూసెక్కుల నీరు, రెండో పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయం నుంచి సాగర్‌కు విడుదల అవుతోంది. కాగా, ఉష్ణోగ్రతల వల్ల 80 క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి ఆవిరైనట్లు డ్యాం అధికారులు తెలిపారు.