Others

కేథరిన్ స్థానంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హృదయాలను గిలిగింతలు పెట్టే అందాల భామ కేథరిన్ ట్రెస్సాకు ఈమధ్య వరుస అవకాశాలు క్యూకట్టాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ సినిమాలో ఎం.ఎల్.ఏ పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ తాజాగా ఈమెకు షాకిచ్చింది గ్లామర్ భామ కాజల్. ఆ వివరాల్లోకి వెళితే.. రవితేజ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘్భగన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కేథరిన్‌ను అనుకున్నారు. కానీ చివరికి ఏమైందో మరి.. ఆ ప్లేస్‌లోకి గ్లామర్ భామ కాజల్ వచ్చి చేరింది. ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కాజల్‌కు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. నిజానికి కేథరిన్ ప్లేస్‌లో కాజల్‌ను తీసుకోవడానికి కారణాలేమిటనేది తెలియాల్సి వుంది. ప్రస్తుతం కాజల్ ఓ తమిళ చిత్రంతోపాటు తెలుగులో మరో చిత్రాన్ని చేస్తోంది.