తెలంగాణ

పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: పెట్రోల్, డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బుధవారం టిఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో జిఎస్టీపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాజకీయ విశే్లషకులు పి లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే పన్ను అని తీసుకువచ్చిన జిఎస్‌టిలో 12వందల రకాల వస్తువులపై 5నుంచి 28శాతం, 5రకాల పన్నులు వేస్తూ 80శాతం వస్తువులపై 18నుంచి 28శాతం పన్ను వేసిందన్నారు. ఆహార పదార్థాలపై పన్ను లేదు. కానీ పసుపుకొమ్ములు, దంచి పసుపు పొడి తయారు చేసి ప్యాకెట్‌లో పెట్టి అమ్మితే పన్ను, మిరపకాయలను పొడి చేసి ప్యాకెట్లలో అమ్మితే పన్ను..ఇలా ఆహార పదార్థాల పైన కూడా పన్ను వేయడం బాధాకరమన్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చి రవాణా రంగాన్ని బతికించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ బాబు మాట్లాడుతూ, పరోక్ష పన్నులపై 1986లోనే సంస్కరణలు జరిగాయని, జిఎస్‌టికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 నుండి దాదాపు 7సంవత్సరాలు కొనసాగించిందన్నారు. జిఎస్టీ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో ఉందని, మొదటగా ఫ్రాన్స్ దేశం 5శాతం జిఎస్‌టి ప్రవేశపెట్టిందన్నారు. రాజ్యాంగానికి 101వ,సవరణ జరిపి ఆనాటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ జూలై ఒకటి నుంచి వన్ నేషన్-వన్ ట్యాక్స్ జిఎస్‌టిని అమలు జరిపారన్నారు. దేశాభివృద్ధికే జిఎస్‌టి అయితే అమెరికా దేశంలో జిఎస్‌టి లేకుండానే అభివృద్ధి చెందలేదా? అని ఆయన ప్రశ్నించారు. సబ్బులపై 18శాతం, డిటర్జెంట్‌లపై 28శాతం జిఎస్‌టి విధించడాన్ని ఆయన తప్పు బట్టారు. ధనవంతులు ప్రయాణించే వినాల్లో ఇంధనానికి జిఎస్‌టి లేదు.. కానీ సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సు డీజిల్ 24.5శాతం సేల్స్ ట్యాక్స్ విధించడం ఎవరిని బాగుచేయడానికి అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.