ఆంధ్రప్రదేశ్‌

ఐకానిక్ భవనాల డిజైన్లు బాగున్నాయి! నెటిజన్ల ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాలు హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ డిజైన్లకు సంబంధించి 13 ఫొటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్లలో ప్రభుత్వం పోస్టు చేసింది. గతంలో జైకా సంస్థ రూపొందించిన డిజైన్లపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. డిజైన్లపై ప్రజల అభిప్రాయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. డిజైన్లను 99 శాతం మంది బాగున్నాయంటూ లైక్ చేయడం విశేషం. కాగా, ఈ నెల 24, 25 తేదీల్లో బ్రిటన్‌లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. 25న నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో సిఎం చర్చించనున్నారు. డిజైన్లను దాదాపు ఖరారు చేయనున్నారు.

చంద్రబాబును కలిసిన తానా ప్రతినిధులు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 18: అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తానా ప్రతినిధులు కలసుకున్నారు. అమెరికాలో 20 నగరాలలో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. 2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు తానా ఆసక్తి, అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తానా ప్రతినిధులు అభ్యర్థించారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
చికాగో యూనివర్శిటీ చైర్మన్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చికాగో స్టేట్ యూనివర్శిటీ చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైనె్సస్ ప్రొఫెసర్ రోహన్ అత్తెలె సమావేశమయ్యారు. యూనివర్శిటీ 150వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీ (స్నాతకోత్సవం)లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. డైనమిక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఎపిలోని విశ్వవిద్యాలయాలకు అందిస్తామని ప్రొఫెసర్ రోహన్ ప్రతిపాదించారు.

మంత్రులు, నేతల
దీపావళి శుభాకాంక్షలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపి అధ్యక్షుడు కళా వెంకట్రావు వేర్వేరు ప్రకటనల్లో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర సంహారంతో దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ జరిగిన ఈ దీపావళి సత్యభామ ద్వారా మహిళా శక్తికి ప్రతీకగా నిలబడడం గర్వకారణమన్నారు. ఈ దీపావళి పండుగ ప్రతి తెలుగింటి ముంగిట్లో అభివృద్ధి, సంక్షేమ కాంతులను మెరిపించాలని, తెలుగు ప్రజలు ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మరోసారి అవతరించడానికి ఎదురైన శుభ సంకేతమే ఈ దీపావళి పండుగని అభివర్ణించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, శిద్దా రాఘవరావు, అమరనాథ్‌రెడ్డి, మాణిక్యాలరావు, చినరాజప్ప, కెఇ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస్, నారాయణ, పరిటాల సునీత, టిడిపి పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కర్త ఎమ్మెల్సీ టిడి జనార్థన్, కార్యక్రమాల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ వివివి చౌదరి, ఎపి కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, తమ ప్రకటనల్లో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
కోడెల, జగన్, రఘువీరా
శుభాకాంక్షలు
జగతిని జాగృతం చేసే చైతన్యదీప్తుల శోభావళి దీపావళి అని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలో తెలుగు వారందరూ దీపావళి పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కాగా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వేర్వేరు ప్రకటనల్లో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకతే దీపావళి అని వారు తమ ప్రకటనల్లో పేర్కొన్నారు. అందరి జీవితాల్లో వెలుగు నింపాలన్నారు.