ఆంధ్రప్రదేశ్‌

దేశ రక్షణలో పోలీసుల పాత్ర అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 21: దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి అజరామరమని, విధి నిర్వహణలో వారి ప్రాణాలను పణంగా పెట్టి సమాజానికి సేవ చేస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలవాలని కోరారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని శనివారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సంవత్సరం మన దేశంలో అనేక దురదృష్టకర సంఘటనలు జరిగాయని, వివిధ ఘటనల్లో 383 మంది పోలీసులు ఆయా రాష్ట్రాల్లో మృతి చెందారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఐదుగురు పోలీసులు అశువులు బాసారని వాపోయారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ అక్టోబర్ 21 1959లో కేంద్ర రిజర్వ్ పోలీసులకు చెందిన ఓ చిన్న పోలీస్ పార్టీ లడక్‌లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దేశ సరిహద్దు రక్షణ కోసం విధుల్లో ఉండగా చైనీస్ అంబుష్ పార్టీలో చిక్కుకుందన్నారు. ఆ ఘటనలో విదేశీ సైనికుల చేతిలో 10 మంది పోలీసులు అమరులయ్యారని, సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయంగా నిలచిందని పేర్కొన్నారు. నాటి నుండి ఏటా అక్టోబర్ 21వ తేదీని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.

చిత్రం..నివాళులు అర్పిస్తున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం