కృష్ణ

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, అక్టోబర్ 23: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బి లక్ష్మీకాంతం స్వామివారిని దర్శించుకున్నారు. బుద్ధప్రసాద్ దంపతులు వేకువ జామున 3గంటలకు ఆలయంలో తొలి పూజలు నిర్వహించి, స్వామి దర్శనానంతరం ప్రాంగణంలోని నాగపుట్టలో పాలు పోశారు. అనంతరం ప్రముఖుల కు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదాకుమారి స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణం తిరుణాళ్ల వాతావరణం నెలకొంది. సుమారు లక్ష మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించటంతో పాటు నాగపుట్టలో పాలు పోసినట్లు అధికారులు తెలియజేశారు. చల్లపల్లి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో కాకరపర్తి సురేష్ సౌజన్యంతో ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. క్యూలైన్‌లోని భక్తులకు ఆలయం తరపున చిన్నారులకు పాలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఎంపిహెచ్‌ఇఓ ఎఎస్‌ఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో మోపిదేవి పిహెచ్‌సి వైద్య బృందం ఆలయం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అవనిగడ్డ డిఎస్పీ వి పోతురాజు ఆధ్వర్యంలో చల్లపల్లి సిఐ జనార్ధన్ పర్యవేక్షణలో ఆరుగురు ఎస్‌ఐలు, 125 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 మంది వాలంటీర్లు భక్తులకు సేవలందించారు. కోసూరువారిపాలెం గ్రామంలోని కృష్ణానదిలో ఏర్పాటు చేసిన శివాలయానికి భక్తులు విశేష సంఖ్యలో వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి నాగపుట్టలో పాలు పోశారు. అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు.

ముడ భూసమీకరణను వేగవంతం చేయాలి
* జెసి విజయకృష్ణన్

మచిలీపట్నం, అక్టోబర్ 23: బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ ముడ అధికారులను ఆదేశించారు. భూసమీకరణపై సోమవారం ఆమె తన ఛాంబర్‌లో ముడ అధికారులతో సమీక్షించారు. ముడ కార్యాకలాపాలను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణానికి రైతుల నుండి ఏ మేర భూములు సమీకరించారో తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబు, పరిశ్రమల శాఖ జియం ఎ సుధాకర్, తహశీల్దార్ నారదముని, ముడ డెప్యూటీ కలెక్టర్లు ధర్మారెడ్డి, సమజ తదితరులు పాల్గొన్నారు.