విజయనగరం

నేటి నుంచి హాకీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 11: విజయనగరం పట్టణంలో మూడురోజులు పాటు నిర్వహించే 6వ రాష్టస్థ్రాయి హాకీ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం పోటీల వేదిక ఎం ఆర్ కాలేజి క్రీడా మైదానంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టోర్నమెంట్ నిర్వాహకులు అసోసియేషన్ అధ్యక్షుడు ఐవిపిరాజు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర స్థాయి కబడ్డీపోటీలు ఘనంగా నిర్వహించామని, అదే ఉత్సాహంతో 6వ రాష్ట్ర స్థాయి పివిజిరాజు స్మారక హాకీ మెన్ పోటీలు మూడురోజులు 12,13,14తేదీల్లో విజయనగరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం క్రీడలను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి క్రీడాకారులను ప్రోత్సహించినపుడే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభ వెలికి వస్తుందని అన్నారు. కబడ్డీ, ఖోఖోక్రీడా అంశాల్లో ఎందరో క్రీడాకారులు భగవాన్ దాస్ శిష్యరికంలో రాణించి రాష్ట్ర,జాతీయ స్థాయిల్లో పేరు పొందారని, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కొండవెలగాడ గ్రామానికి చెందిన ఎందరో విశేషంగా రాణించి దేశానికి, జిల్లాకు ఏమంచి పేరు సాధించారని తెలిపారు. అదేకోవలో దేశ జాతీయ క్రీడ అయిన హాకీని కూడా ఈప్రాంతంలో ప్రోత్సహించేందుకు తామంతా ముందుకు వచ్చామని అన్నారు. 13 జిల్లాలనుండి జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. అయోధ్య మైదానం, జెఎన్ టియు క్యాంపస్ లలో ఈపోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు. ఈపోటీలను తిలకించి విజయవంతం చేయాలని క్రీడాభిమానులను కోరారు. ఈసమావేశంలో ఎం ఆర్ కళాశాల పిడి వాసుదేవరాజు తదితరులు పాల్గొన్నారు. కాలేజి క్రీడామైదానంలో జిల్లా జట్టు ముమ్మర సాధన చేసింది. ఇందుకోసం ధ్యాన్ చంద్ బొమ్మలు, ప్రముఖ హాకీ క్రీడాకారులతో రూపొందించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఈపోటీలను కలెక్టర్ ఎం ఎం నాయక్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల
ధ్రువపత్రాల పరిశీలన
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 11: డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ లింగేశ్వరరెడ్డిల పర్యవేక్షణలో ఈపరిశీలన నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో విద్యాశాఖ అధికారులు అభ్యర్థుల ఒరిజనల్ ధ్రువపత్రాలను తనిఖీచేసారు. కమ్యూనిటీ సర్ట్ఫికెట్లు ఎస్సీ, బిసి కార్పొరేషన్ అధికారులు, మీసేవ ద్వారా జారీ కాబడిన సర్ట్ఫికెట్లు మీసేవ సిబ్బంది ద్వారా తనిఖీచేసారు. ఈసందర్భంగా డిఈ ఓ కృష్ణారావు విలేఖర్లతో మాట్లాడుతూ 339 మంది డి ఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పరిశీలనకు వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు. గురువారం 99 ఎస్‌జిటిలకు, 30 మంది పండిట్లు, 69మంది ఎస్‌జిటిల సర్ట్ఫికెట్లు పరిశీలన చేస్తామని, శుక్రవారం 100మంది ఎస్‌జిటిల సర్ట్ఫికెట్లు పరిశీలన జరుగుతుందని వెల్లడించారు. అయితే 225మంది ఎస్‌జిటిలకు 26 పోస్టులకు సంబంధించి ఆ కేటగిరి అభ్యర్థులు లేనందున ఆయా పోస్టులకు వెరిఫికేషను ఉండదని వివరించారు. మిగిలిన అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన పూర్తిచేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. తుది జాబితా రాగానే విద్యాశాఖ ఆదేశాలతో వారికి ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

జవాన్ల త్యాగాలు అజరామరం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 11: దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరజనాన్లు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచి ఉండాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భీశెట్టి బాబ్జీ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద శాంతిజ్యోతి వెలిగించి వీరజవాన్లకు ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ కాశ్మీర్‌లోని పాక్ సరిహద్దులో సియాచిన్‌లో మంచు పర్వతాలలో దేశ రక్షణ కోసం పాటు పడుతున్న జవాన్లు మంచుతుఫాన్ ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. లాన్స్‌నాయక్ హనుమంతప్ప మృతి దేశ ప్రజలకు కలచివేసిందని తెలిపారు. వీరజవాన్లు ముస్తాక్ అహ్మద్, సుబేదార్ నాగేశ్, హవల్దార్ వేలుమలై, కుమార్, సుదీష్‌లో, సిఫాయిలు మహేష్, గణేష్, రామమూర్తి, నర్సింగ్ అసిస్టెంట్ సూర్యవంశీలు మంచుతుఫాన్‌లో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఆ వీరజవాన్లకు త్యాగాలకు దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తూ యావత్తు ప్రజలు నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అప్పారావు, చైతన్య యుజవన సేవా సంఘం సభ్యులు రమేష్, వీరాస్వామి, శ్రావణి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

రూ.342 కోట్ల ధాన్యం కొనుగోలు చెల్లింపులు

గజపతినగరం, ఫిబ్రవరి 11: జిల్లాలో ఇంతవరకు 2 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి రూ.342 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసామని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కేష్ బాలాజీ లఠ్కర్ వెల్లడించారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ లఠ్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 394 కోట్లకు గాను ఇంకా సుమారు 50 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 11 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని నెలాఖరు లోగా దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించామని అన్నారు. ఇప్పటి వరకు లక్ష రెండువేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్స్ నుండి ఎఫ్ సి ఐ గొడౌన్‌లకు చేరిందని తెలిపారు. జిల్లాలో 95 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వకు సంబంధించి మాత్రమే గొడౌన్‌లు ఉన్నాయని మిగతా బియ్యాన్ని ధాన్యం తక్కువగా పండించే జిల్లాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 34330 రేషన్‌కార్డులు డిసెంబర్ నెలలో మంజూరు చేయగా ఇంకా 1147 కార్డులు లభ్ధిదారులకు అందజేయలేదని అన్నారు. కొన్ని కార్డులు జన్మభూమి కమిటీలు ఆమోదించాల్సి ఉందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల్లో లోపాలు సరిదిద్దాలని అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. అందులో భాగంగానే వారు చేస్తున్న ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఇంతవరకు ఈ - పాస్ విధానంలో 74 శాతం మంది లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేసామని తెలిపారు. ఐరిస్‌కూడా పడని వారికి కొత్త ఐరిష్ మిషన్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాత రేషన్‌కార్డుల్లో అదనపుపేర్లు నమోదుకు సంబంధించి కమీషనర్‌కు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్‌పాత్రో, డి ఎస్ ఓ తదితరులు పాల్గొన్నారు.

70 శాతం ఈ -పాస్ యంత్రాలతో సరుకుల పంపిణీ
*జెసి శ్రీకేష్ లఠ్కర్
దత్తిరాజేరు, ఫిబ్రవరి 11: జిల్లాలో 70 శాతం రేషన్ డిపోల్లో ఈ- పాస్ యంత్రాలతో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టనున్నట్లు జెసి శ్రీకేష్ లఠ్కర్ అన్నారు. గురువారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 3430 కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు రాగా 2200 కొత్తకార్డులు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ఇంకా 1230 కార్డులు రావాల్సి ఉండగా 376 పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు 342 కోట్లు రూపాయలతో ధాన్యం కొనుగోలు బిల్లులు చెల్లింపులు జరిగాయని అన్నారు. ఎపిజివి బ్యాంకుల వలన కొద్దిగా నగదు చెల్లింపులు ఆలస్యంగా జరిగిందని ఇకపై త్వరలోనే బిల్లులు చెల్లింపులు చెస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు అక్రమాలపై విలేఖరులను ప్రశ్నించగా అక్రమలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. మండలంలో విజిలెన్స్ కమిటీ సభ్యుల ద్వారా పర్యవేక్షణ చేపట్టి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం కంప్యూటర్ అపరేటర్ల పనితీరుపై అరా తీసారు. రేషన్‌కార్డులులో పేర్లు సవరణ ఏ విధంగా చేపడుతున్నారని ప్రత్యేక్షంగా పరిక్షించారు. తహశీల్ధార్ సిబ్బందికి కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉండాలని అన్నారు. దీనితో పాటు పౌరసరఫరా జిల్లా అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 11: భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల కోసం ఈనెల 15వ తేదీన ఆన్‌లైన్ ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని పట్టణ ప్రణాళిక విభాగం రీజనల్‌డైరెక్టర్ వి.రామ్‌కుమార్ తెలిపారు. భవన నిర్మాణదారులకు త్వరితగతిన అనుమతులు అందించేందుకు ఆన్‌లైన్ దరఖారుల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతుల మంజూరులో ఎటువంటి జాప్యం ఉందని అన్నారు. గురువారం ఇక్కడ నగర పాలక సంస్థ ప్రణాళిక విభాగం కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బిపిఎస్) ద్వారా ఉత్తరాంధ్రలో 15, 830 దరఖాస్తులను పరిష్కరించామని, తద్వారా 15,84,84,663 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో 47 అనధికార లేఅవుట్లను గుర్తించామని చెప్పారు. ఇందులో బొబ్బిలి మున్సిపాలిటీలో 21, నర్సీపట్నంలో ఒకటి, సాలూరులో ఐదు, పార్వతీపురం మున్సిపాలిటీలో ఎనిమిది, పలాస మున్సిపాలిటీలో 12 అనధికార లేఅవుట్లు ఉన్నాయని తెలిపారు. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఉమాభాస్కరరావుతదితరులు పాల్గొన్నారు.
లాకౌట్ ఎత్తివేతకు కార్మికమంత్రి హామీ
* యూనియన్ నేతలు వెల్లడి
విజయనగరం (టౌన్ ), ఫిబ్రవరి 11: అరుణాజూట్‌మిల్లు లాకౌట్‌ను నిషేధించేందుకు రాష్ట్ర కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని అరుణాజూట్‌మిల్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శంకరరావు తెలిపారు.జూట్‌మిల్లు అక్రమ లాకౌట్ సమస్యపై యూనియన్ నాయకులు గురువారం కార్మికమంత్రి స్వగ్రామం శ్రీకాకుశం జిల్లా నిమ్మాడకు వెళ్లి కలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు జూట్‌మిల్లు అక్రమలాకౌట్ జరిగి వంద రోజులు అయిందని తెలిపారు.పారిశ్రామిక వివాదాల చట్టం కింద అక్రమ లాకౌట్‌ను నిషేధించి కార్మికులకు న్యాయం చేయాలని ఆయనకు వివరించారు. మంత్రి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాల్లో లాకౌట్ నిషేధిస్తూ ఉత్తర్వులు రూపొందించాలని ఆదేశించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.కార్మిక మంత్రిని కలిసేందుకు ఎమ్మెల్యే మీసాలగీత పూర్తిస్ధాయిలో సహకరించారని తెలిపారు. మంత్రిని కలిసిన బృందంలో మున్సిపల్ కౌన్సిలర్ రొంగలి రామారావు,శ్రీను, అప్పారావు, నారాయణరావు తదితరులున్నారు.
దేవీస్వరూపం
కన్యకాపరమేశ్వరి అమ్మవారు’
విజయనగరం (పూల్‌బాగ్),్ఫబ్రవరి 11: కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేవీ స్వరూపమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకుడు రామానాయుడు అన్నారు.పూల్‌బాగ్‌లోని వృద్ధాశ్రమంలో గురువారం అమ్మవారిపై ఆధ్యాత్మిక ప్రసంగం చేసారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఏవిధంగా ఆత్మార్పణ చేసుకున్నారో సవివరంగా తెలిపారు.పెళ్లి మండపంలోని అగ్నిగుండంలో దుమికి దేవిలో ఐక్యమయ్యారని పేర్కొన్నారు. వైశ్యులకే కాకుండా సమస్త మానవాళికి ఆరాధ్యదైవంగా అమ్మ కొలవబడుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ సిబ్బంది, వృద్ధులు పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు ఘంటసాల

విజయనగరం (పూల్‌బాగ్), ఫిబ్రవరి 11: ప్రముఖ నేపథ్యగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సదా స్మరణీయుడని ఘంటసాల స్మారక కళాపీఠం అధ్యక్షుడు పి.వి.నరసింహరాజు అన్నారు.గురువారం ఘంటసాల వర్ధంతిని పురస్కరించుకుని గుచీవద్ద ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ ఘంటసాల పాడిన పాటలు అజరామరమని అన్నారు. నేటి ఔత్సాహిక గాయకులు ఘంటసాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.కళాపీఠం కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు మాట్లాడుతూ విజయనగరానికి పేరు తెచ్చిన వ్యక్తి ఘంటసాల అని అన్నారు. సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుని సినీ రంగంలో తిరుగులేని గాయకునిగా పేరు సంపాదించుకున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కళాపీఠం సభ్యులు పాల్గొన్నారు.రాత్రి గురజాడ కళాభారతిలో సినీ,గీత, పద్య సంగీత విభావరి కార్యక్రమం జరిగింది.్భగవతీ నృత్య కళామందిర్ విద్యార్ధినులు పలు చిత్రాల్లోని గీతాలకు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సినీ సంగీత విభావరిలో లావణ్య, జయంతి, సుమవర్ష, శ్రీనివాసరావు, గుప్తా, లక్ష్మణరావు పలు గీతాలను ఆలపించారు. ధవళ విశే్వశ్వరావు ఆలపించిన పద్యాలకు ఆహూతుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. కీబోర్డుపై బొత్స సుఖి, వాగ్దేవి, రాఘవేంద్ర నాయుడు సహకారమందించారు. అధిక సంఖ్యలో సినీ సంగీతాభిమానులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ రోగులకు మందులు పంపిణీ
గజపతినగరం, ఫిబ్రవరి 11: ఎయిడ్స్ రోగులకు మందుల పంపిణీ కార్యక్రమం సిటిసి కేంద్రాల నుండి అందజేస్తామని జిల్లా ఎ ఆర్‌టి అధికారి వరలక్ష్మి చెప్పారు. గురువారం ఇక్కడ సిటిసి కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతవరకు ఎయిడ్స్ రోగులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల ద్వారా మందులు తీసుకునే వారని చెప్పారు. రోగులకు అందుబాటులో ఉండే భోగాపురం, గజపతినగరం, పార్వతీపురం, చీపురుపల్లి, సాలూరు, బొబ్బిలి, బాడంగిలలో గల సిటిసి కేంద్రాల ద్వారా అందజేస్తామని చెప్పారు. జిల్లాలో సుమారు 10 వేల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని చెప్పారు. గజపతినగరం ప్రాంతంలో 46 మంది రోగులు ఉన్నారని చెప్పారు. మందులు వినియోగించుకోవాలని కోరారు.

గైనిక్ వైద్యశిబిరానికి విశేష స్పందన

విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 11: మాతాశిశు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో గురువారం ఘోషాసుపత్రిలో గర్భిణులకు గైనిక్ సంబంధిత వైద్యపరిక్షలను ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ రవిచంద్ర నేతృత్వంలో మహిళా వైద్యులు చిత్రరేఖ , డాక్టర్ సుధ, రజియాలు నిర్వహించారు. గర్భిణులకు అవసరమైన ముందస్తు వైద్యపరీక్షలను ఈసందర్భంగా నిర్వహించారు. మధుమేహం, హెచ్ ఐవి, బ్లడ్‌టెస్టులు, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందచేసారు. ఇన్సులిన్ అవసరమైన వారికి ఇంజక్షన్లు వేసారు. ధైరాయిడ్ లోపాలు లేకుండా పుట్టే బిడ్డ బుధ్ధిమాంద్య లోపం లేకుండా నివారించేందకు ఈపరీక్షలు ఉపయోగపడతాయని డాక్టర్ రవిచంద్ర చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్ప ఇటువంటి ఉచిత వైద్యసేవలు ఉపయోగించుకుని మాతా శిశు ఆరోగ్యంను కాపాడుకోవాలని ఆయన కోరారు. వివిధగ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు గర్భిణులు, మహిళలు ఈ శిబిరంలో పరిక్షలు నిర్వహించుకున్నారు. శిబిరానికి హాజరైన గర్భిణులకు ఆసుపత్రి సిబ్బంది గులాబీలు, బిస్కెట్లతో స్వాగతం పలికారు. మాతాశిశు ఆరోగ్యంపై హాజరైన మహిళలకు పలు ఆరోగ్యసూత్రాలపై అవగాహన కల్పించారు.
రిజర్వేషన్ల సాధనకు సంతకాల సేకరణ
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 11: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీఎస్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో గురువారం నగరంలో బొగ్గులదిబ్బ, ఎల్‌బి కాలనీలలో సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ మాట్లాడుతూ పెరుగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపధ్యంలో ప్రభుత్వరంగం నిర్వీర్యమైపోయి ప్రాధాన్యత తగ్గుతుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పాలకులు తూతూమంత్రంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యం గిరిజన అభివృద్ధి కూడా సక్రమంగా జరగడం లేదని అన్నారు. దీనివల్ల ఎస్సీ,ఎస్టీ యువత చదువులకు దూరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్.అప్పలకొండమ్మ, ఎం.దేవుడమ్మ, ఎం.నాగు తదితరులు పాల్గొన్నారు.
నేవీ ఫ్లీట్‌లో
సైనిక పాఠశాల విద్యార్థుల ప్రతిభ
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 11: విశాఖ నగరంలో ఈనెల మూడు నుంచి ఏడవ తేదీ వరకు నిర్వహించిన నేవీ ఫ్లీట్‌లో కోరుకొండ సైనిక్‌స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ నౌకల ప్రదర్శనలో 32 దేశాలకు చెందిన నేవీ ప్రతినిధులతోపాటు కోరుకొండ సైనిక్‌స్కూల్ ఎనిమిదివ తరగతి విద్యార్థులకు కవాతు నిర్వహించారు. ఈ బృందాన్ని నాయకత్వం వహించిన విద్యార్థి శ్రీనివాస్, విద్యార్థులను గురువారం కోరుకొండ స్కూల్‌లో జరిగిన ప్రిన్సిపాల్ గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.