బిజినెస్

సరికొత్త స్థాయిలకు మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 1: ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో భారత్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి వందవ స్థానాన్ని ఆక్రమించడం దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ తొలిసారి బుధవారం 10,400 పాయింట్ల మార్కుకు పైన ముగిసి సరికొత్త రికార్డును సృష్టించింది. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 387 పాయింట్లు పుంజుకొని సరికొత్త రికార్డు స్థాయికి ఎదిగింది. ఎనిమిది కీలక రంగాలు సెప్టెంబర్‌లో ఆరు నెలల గరిష్ఠ స్థాయి అయిన 5.2 శాతం వృద్ధి సాధించడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల ధోరణి వ్యక్తం కావడం భారత మార్కెట్లకు ఊతంగా నిలిచింది. కొన్ని కంపెనీల రెండో త్రైమాసికం ఆదాయాలు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ ఉండటం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బుధవారం 50 షేర్లతో కూడిన నిఫ్టీ ఇంట్రా డేలో తొలిసారి 10,450 పాయింట్ల మార్కును తాకింది. చివరలో స్వల్పంగా తగ్గి 10,440.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తం మీద 105.20 పాయింట్లు (1.02 శాతం) పుంజుకుంది. అంటే అక్టోబర్ 30న చేరుకున్న 10,363.65 పాయింట్ల రికార్డును బుధవారం అధిగమించింది. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ కూడా బుధవారం ఇంట్రా డేలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి అయిన 33,651.52 పాయింట్లకు ఎగబాకింది. అయితే సెషన్ చివరలో కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్వల్పంగా తగ్గినప్పటికీ, సరికొత్త రికార్డు స్థాయి 33,600.27 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తం మీద 387.14 పాయింట్లు (1.17 శాతం) పుంజుకుంది. అంటే అక్టోబర్ 30నాటి క్లోజింగ్ రికార్డు 33,266.16 పాయింట్లను అధిగమించింది.
ప్రపంచ బ్యాంకు మంగళవారం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో భారత్ చరిత్రాత్మకంగా తన స్థానాన్ని పటిష్ఠపరచుకోవడంతో పాటు ప్రపంచ మార్కెట్లలోని సానుకూల ధోరణి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం వంటివి దేశీయ మార్కెట్లకు ఛోదకశక్తిలా పనిచేశాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ, లోహ, ఎఫ్‌ఎంసిజి రంగాల నుంచి అందిన బలమైన సెంటిమెంట్ మద్దతుతో మార్కెట్ సూచీలు పైకి ఎగబాకాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ తెలిపారు.