బిజినెస్

నల్లధనానికి కాంగ్రెస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 8: పెద్దనోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని తమ పార్టీ ‘నల్లధనం వ్యతిరేక దినం’గా పాటిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని భాజపా నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. నల్లధనాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నందున దేశంలో రెండు రాజకీయ సంస్కృతుల మధ్య సమరం సాగుతోందని ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. నిజాయితీతో నడుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలని, చిత్తశుద్ధి లేనివారిని దండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లధనానికి మద్దతునిస్తుండగా తమ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఈ వ్యత్యాసాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు తమ ప్రభుత్వం నిజాయితీతో పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. రెండు రాజకీయ సంస్కృతుల మధ్య జరుగుతున్న పోరాటానికి గత మూడున్నరేళ్ల మోదీ పాలనే ఇందుకు సాక్ష్యమని జవదేకర్ అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం నగదు చెలామణి నుంచి అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి, నల్లధనాన్ని నివారించేందుకు, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేసేందుకు, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నట్టు నోట్లరద్దు సందర్భంగా ప్రధాని ప్రకటించారు. పెద్దనోట్లను రద్దు చేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని ఆరోపిస్తూ బుధవారం నాడు ‘బ్లాక్ డే’ పాటించాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పిలుపునిచ్చాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైనదని, అవినీతి, నల్లధనం అంతానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి జవదేకర్ అన్నారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాలకు ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన వివరించారు. నోట్లరద్దును ఓ ‘పెద్ద తప్పిదం’గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించడాన్ని జవదేకర్ తీవ్రంగా ఖండించారు. మన్మోహన్ నాయకత్వంలోనే 2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ కుంభకోణాలు జరిగాయని, అవినీతికి కాంగ్రెస్ నిలువెత్తు నిదర్శనమని ఆయన ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రతి రూపాయికి సంబంధించి వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. భారీ స్థాయిలో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుగుతోందన్నారు. అక్రమ పద్ధతుల్లో బ్యాంకు ఖాతాల్లో చేరిన డబ్బుపై దర్యాప్తు పూర్తయ్యాక నిందితులపై తగు చర్యలు ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. నల్లధనం సాయంతో ఏర్పాటైన 37,000 డొల్ల కంపెనీల బండారం బయటపడిందంటే అది నోట్లరద్దు వల్లనేనని ఆయన తెలిపారు. డొల్ల కంపెనీలను స్థాపించిన వారిని గుర్తించి చట్ట ప్రకారం శిక్షిస్తామని, అనుమానాస్పద ఖాతాలన్నింటినీ స్తంభింపజేస్తామని చెప్పారు.మాల్యా ఇక పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ కుదుటపడిందని జవదేకర్ అన్నారు.