Others
రవితేజకు జోడీగా..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 November 2017
ఇటీవలే ‘రాజా ది గ్రేట్’ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో రవితేజ తనకు ‘దుబాయ్ శీను’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్లతో త్వరలో ఒక సినిమా చేయనున్నాడు. వరుస పరాజయాల్లో వున్న శ్రీనువైట్ల కూడా రవితేజతో చేయబోయే సినిమాతో సక్సెస్ అందుకోవాలనే ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాజల్ గతంలో రవితేజతో వీర, సారొచ్చారు వంటి చిత్రల్లో నటించగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్షా చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.