రాష్ట్రీయం

ఆదేశాలు జవదాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి బోర్డు ఆదేశాలు, సలహాలు, సూచనలను ఆంధ్ర, తెలంగాణలు తుచ తప్పకుండా పాటించాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఉభయ రాష్ట్రాలకు శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాలు పోటీలు పడి చౌకగా వచ్చే జల విద్యుత్ కోసం ఆశపడితే, వచ్చే రబీ సీజన్, వేసవికాలంలో సాగు, మంచినీటి అవసరాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని కృష్ణా బోర్డు గతంలోనే పేర్కొంది. ఆంధ్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదలను నిలిపివేయాలని కేంద్రం లేఖలో కోరింది. తెలంగాణ ప్రభుత్వం జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ దిగువకు నీటి విడుదల చేయడం, ఆంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నీటి కొరత ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్రం లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
కాగా తెలంగాణ ప్రభుత్వం తమకు 86 టిఎంసి నీటిని రబీ సీజన్, మంచినీటి అవసరాలకు విడుదల చేయాలని తాజాగా కృష్ణా బోర్డుకు పంపిన ఇండెంట్‌లో కోరింది. నాగార్జునసాగార్ ఎడమ ఆయకట్టుకు 41 టిఎంసి, కల్వకుర్తి ఆయకట్టుకు పది టిఎంసి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 10 టిఎంసి, హైదరాబాద్ మంచి నీటి అవసరాలకు 25 టిఎంసి నీటిని కేటాయించాలని తెలంగాణ కోరింది. వచ్చే రబీ సీజన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నీటి అవసరాల ప్రణాళికను ఖరారు చేసి బోర్డు ఆమోదం నిమిత్తం పంపింది. డిసెంబర్‌లో నీటి అవసరాల నిమిత్తం కృష్ణా బోర్డు తాజాగా ఆంధ్రకు 14 టిఎంసి, తెలంగాణకు 12.6 టిఎంసి నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో మొత్తం 599 టిఎంసి నీరు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ద్వారా ప్రవహించగా, ఇంతవరకు 247 టిఎంసి నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం డెడ్ స్టోరేజీపైన 252 టిఎంసి నీరు ఉంది. ఈ నీటిని 66:34 నిష్పత్తి మేరకు రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం తమకు 86 టిఎంసి నీరు కేటాయించాల్సి ఉంటుందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కృష్ణా బోర్డును కోరింది. వచ్చే ఏడాది జూలై వరకు కృష్ణా నదిలోకి నీటి ప్రవాహం ఉండదు. అందుకే బోర్డు ఖరారు చేసే నీటి కేటాయింపులను జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలనూ కోరింది.