బిజినెస్

లక్ష్యాల సాధనలో డీసీసీబీ ప్రథమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 2: వాణిజ్య బ్యాంకులకు దీటుగా వ్యాపార లక్ష్యాలు సాధించడం కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూనే వార్షిక లక్ష్యాల సాధన కోసం సరికొత్త తరహాలో ‘మొబైల్ వ్యాన్’తో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మరే వాణిజ్య బ్యాంకులకు లేనివిధంగా మొబైల్ వ్యాన్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం జరిపేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ నెలాఖరిలోపు తొలుత బ్యాంకు ప్రధాన కార్యాలయంలో దీనిని ప్రారంభిస్తారు. ఆ తరువాత జిల్లావ్యాప్తంగా గ్రామీణ, మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోను దీని ద్వారా ప్రచార కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ప్రవేశపెట్టిన పలు ఆకర్షణీయమైన పథకాలు, ఖరీఫ్, రబీ సీజన్లలో రైతు సభ్యులకు అమలు చేసే పథకాలు, వీటికి మంజూరు చేసే రుణ సదుపాయాలు, డిపాజిట్ల శాతాన్ని పెంచుకునే విధంగా ఈ వ్యాన్ ప్రచారం ఉంటుంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఉన్న 28 బ్యాంకు శాఖల ద్వారా డిపాజిట్లను సేకరించేందుకు రూ.1100 కోట్ల పైబడి లావాదేవీలు నిర్వహించాలని బ్యాంకు యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 80 శాతం మేర లక్ష్యాలు పూర్తిచేయగలిగింది. 1981లో డీసీసీ బ్యాంకు 13 బ్రాంచీలతో ప్రారంభించగా, దశలవారీగా వృద్ధి చెందుతూ 28 శాఖల విస్తరణకు చేరుకుంది. అలాగే రైతుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని ఏర్పాటైన 98 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఎసీఎస్)ల ద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. నాబార్డు, ఆప్కాబ్‌ల ఆర్థిక సహకారంతో రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్న బ్యాంకు జిల్లావ్యాప్తంగా త్వరలో మరో పది కొత్త బ్యాంకు శాఖల ప్రారంభించనుంది. ఖాతాదారుల సౌలభ్యం కోసం ప్రతిఒక్క బ్యాంకు శాఖలోను ఏటీఎంల సదుపాయాల్ని కల్పించింది. వీటన్నింటితోపాటు వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణ ఇంటి నిర్మాణాలకు, వ్యవసాయ ఉత్పత్తి అభివృద్ధి, నగదు పరపతి ద్వారాను, ఇంటి తనాఖా, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులకు, స్వరాజ్ క్రెడిట్ కార్డుల పథకం కింద గ్రామీణ చేతివృత్తుల వారికి రుణ సదుపాయాలు కల్పించే విధానాన్ని ఈ బ్యాంకు యాజమాన్యం వేగవంతం చేసింది. కేంద్రం ప్రతిపాదించిన ప్రధానమంత్రి జీవనజ్యోతి, ప్రధానమంత్రి సురక్ష, అటల్ పెన్షన్ యోజన పథకాలు పటిష్ఠంగా అమలవుతున్నాయి. అలాగే అద్దెలు భారం కాకుండా ఉండేందుకు జిల్లాలో బ్యాంకు కార్యాలయాలను సొంత భవనాల్లోనే ఏర్పాటు చేసుకుంటుంది. బ్యాంకు ద్వారా ఆన్‌లైను సేవలు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లకు పైగానే ఖరీఫ్, రబీ సీజనల్లో రైతు సభ్యులకు 40శాతం మేర రుణాలు మంజూరు చేయగా, సహకార సంఘాల ద్వారా 21 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగ, మరో 15 కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించింది. బ్యాంకు ఉద్యోగుల మాదిరి సహకార సంఘాల ఉద్యోగుల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించడం, తద్వారా ఒక లక్ష రూపాయల వరకు నగదు రహిత వైద్యసేవలు అందించనున్నట్టు బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణాధికారి డీవీఎస్ వర్మ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. మొబైల్ వ్యాన్ ప్రచారాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.