రాష్ట్రీయం

కాచిగూడ నుంచి కాకినాడకు 8 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: అధిక రద్దీ నివారణ దృష్ట్యా కాచిగూడ నుంచి పలు గమ్య స్ధానాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిసెంబర్ 8, 15, 29 తేదీల్లో సాయంత్రం 6.45కి కాచిగూడ నుంచి నెం.07425 ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో నెం.07426 రైలు డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో కాకినాడ నుంచి సాయంత్రం 5.50కి బయలు దేరుతుందని తెలిపింది. కాచిగూడ - కృష్ణరాజపురం-కాచిగూడ మధ్య 24 సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపింది. డిసెంబర్ 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో కాచిగూడ నుంచి సాయంత్రం 6 గంటలకు నెం.07603 ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో నెం.07604 ప్రత్యేక రైలు డిసెంబర్ 11, 18, 25, జనవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో కృష్ణరాజపురం నుంచి మధ్యాహ్నాం 3.25 గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడ-విశాఖపట్నం మధ్య 3 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కాచిగూడ నుంచి డిసెంబర్ 12, 19, 26 తేదీల్లో నెం.07016 రైలు సాయంత్రం 6.45కి బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతికి మూడు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
నెం.07488 రైలు డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది. కాగా తిరుపతి నుంచి కాచిగూడకు నెం.07146 రైలు సాయంత్రం 5 గంటలకు డిసెంబర్ 14, 21, 28 తేదీల్లో బయలుదేరుతుందని రైల్వే తెలిపింది.