ఆంధ్రప్రదేశ్‌

భగ్గుమన్న గిరిజనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 3: రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ మంత్రి వర్గం నిర్ణయించడం పట్ల గిరిజనులు భగ్గుమన్నారు. ఈ మేరకు ఆదివారం అనంతపురం నగరంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడికి యత్నించారు. మరోవైపు వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చడాన్ని అభినందిస్తూ ఆయా సంఘాల నేతలు మంత్రి కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో గిరిజనులు కూడా రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి మంత్రి ఇంట్లోకి చొచ్చుకుపోవడానికి యత్నించిన గిరిజనులను అడ్డుకున్నారు. తొలుత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉదయం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఆందోళనకారులు, అక్కడి నుంచి ర్యాలీగా మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ఇంట్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా వాల్మీకులను ఎస్టీల్లో ఎలా చేరుస్తారంటూ గిరిజన నాయకులు, గిరిజన విద్యార్థి సంఘం నేతలు ప్రశ్నించారు. దీంతో స్పందించిన మంత్రి కాలవ మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పల్స్ సర్వే(ప్రాధికార సర్వే) ద్వారా సేకరించిన సమాచారం మేరకు కుల గణన వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఎస్టీల జాబితా కూడా ఉందన్నారు. ఎస్టీలకు 18 శాతానికి రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బీసీలకు, గిరిజనులను నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాజ్యంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించి, రిజర్వేషన్లను 55 శాతం వరకూ పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఇక బోయ, వాల్మీకులు మంత్రి కాలవను ఘనంగా సన్మానించారు.

చిత్రం..అనంతపురంలో తన ఇంటిని ముట్టడించిన గిరిజన ఐక్య వేదిక నాయకులతో మాట్లాడుతున్న మంత్రి కాలవ శ్రీనివాసులు