ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ప్రవాస యువత ప్రత్యేక పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో నిర్వహిస్తున్న ‘ భారతావనిని తెలుసుకోండి’ కార్యక్రమానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. భారతీయ మూలాలు కలిగిన ప్రవాస యువతకు నిర్దేశించిన ఈ వినూత్న కార్యక్రమం భారతీయ జీవనం, సంస్కృతి, కళలు వంటి వాటిని వారికి పరిచయం చేయనుంది. మంగళవారం నుండి తెలుగునాట ఈ బృంద సభ్యులు పర్యటించనున్నారు. ఐదు రోజులపాటు సాగే ఈ పర్యటనలో భాగంగా కనకదుర్గమ్మను దర్శించుకునే ఈ బృందం అమరావతి గుడి, మ్యూజియంలను సందర్శిస్తుంది. స్వయంగా కూచిపూడి గ్రామాన్ని సందర్శించి మన కళల పట్ల అవగాహన పెంపొందించుకుంటారు. ఉన్నత స్థాయి కళాకారులు ప్రదర్శించే నృత్యరీతులను ఆస్వాదిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచే సురభి నాటక కళలను పరిచయం చేసుకుంటారు. కొండపల్లి సందర్శించి అక్కడ ప్రత్యేకంగా తయారయ్యే బొమ్మల పరిశ్రమ కళాకారులతో సమావేశం అవుతారు. స్వచ్ఛంద సంస్థలతో భేటీ అవుతారు. పవిత్ర సంగమంగా ప్రసిద్ధి కెక్కిన కృష్ణా, గోదావరి నందీ సంగమ ప్రాంతాన్ని సందర్శించి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. గుంటుపల్లి బౌద్ధ గుహలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. విశాఖ సాగర అందాలను, గిరిజన నృత్యాలను ఆస్వాదించి స్టీల్ ప్లాంట్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఆరు రోజులపాటు నిరవధికంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నాలుగు రోజులపాటు విజయవాడ, రాజమండ్రి, విశాఖలలో వీరి విడిదికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ విజయభాస్కర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు.