రాష్ట్రీయం

మే 10న నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్ యుజి- 2018)ను వచ్చే ఏడాది మే 10న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరిలో మొదలవుతుంది. దరఖాస్తులను మార్చి మొదటివారం వరకూ ఆన్‌లైన్‌లో పంపించుకునేందుకు, ఫీజు చెల్లించేందుకు గడువు ఉంటుంది. దరఖాస్తులో ఆధార్ కార్డు నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంది. అలాగే మొబైల్ నెంబర్, ఇమెయిల్‌ను కూడా ఇవ్వాలి. కనీసం 17 ఏళ్ల వయస్సు నిండిన వారే నీట్‌కు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలకు మాత్రం ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది. 2017 కంటే ముందు నీట్‌కు హాజరైన వారు ఈసారి పరీక్ష రాసేందుకు అనర్హులు. దేశవ్యాప్తంగా 470 మెడికల్, 308 డెంటల్ కాలేజీల్లో 65,170 సీట్లు ఎంబిబిఎస్‌లోనూ, మరో 25,730 సీట్లు బిడిఎస్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది పరీక్షకు 10,90,085 మంది దరఖాస్తు చేయగా, అందులో 6,11,539 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
ఇంటర్ ఫీజు చెల్లింపునకు గడువు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు అభ్యర్ధులు అటెండెన్స్ మినహాయింపునకు దరఖాస్తు చేసుకునే గడువును డిసెంబర్ 30 వరకూ పొడిగించినట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు. అయితే వీరు వెయ్యి రూపాయిలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
సాంకేతిక విద్యారంగంలో విశేష కృషి చేస్తూ అత్యున్నత ప్రమాణాలు నెలకోల్పిన హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌కు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) ఎ గ్రేడ్ ఇచ్చినట్టు సంస్థ చైర్మన్ డాక్టర్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, కార్యదర్శి అరిమండ విజయ శారదారెడ్డి, డైరెక్టర్ పి భాస్కరరెడ్డిలు తెలిపారు. ఇటీవల కాలేజీని సందర్శించిన నేక్ బృందం అన్ని డిపార్టుమెంట్లకు ఏ గ్రేడ్ ఇచ్చిందని అన్నారు.