మహబూబ్‌నగర్

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 10: క్రీడల్లో గెలుపు ఒటమిలు సహజమని దీనిని ప్రతి ఒక్కరు అనుభూతిగా తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర సినియర్ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్‌బాల్ ముగింపు కార్యక్రమానికి దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డోకూర్ పవన్‌తో కలిసి క్రీడల్లో రాణించిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని చెడువ్యసనాలకు దూరంగా ఉండి వారి ఆశయాలను నేరవేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌యాదవ్, ముత్యాల ప్రకాష్, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.