రాష్ట్రీయం

విద్యుత్ ఉద్యోగుల పంపకంపై ఏకాభిప్రాయానికి రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకాలపై ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ఏపీ సర్కారు హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ధర్మాసనం ఈ కేసు విషయమై రోజూవారీ విచారిస్తామని ప్రకటించింది. ఈ కేసును జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. 1,259 మంది విద్యుత్ ఉద్యోగుల పంపకంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 10వ షెడ్యూల్‌లో ఆస్తులు, అప్పుల అంశం తేలకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసిందన్నారు. ఉద్యోగుల తరఫున న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర విభజన జరగక ముందే విద్యుత్ సంస్థలు రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయని తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల విభజన అవసరం లేదన్నారు.
పీపీ నియామకంపై 20లోగా నివేదిక ఇవ్వండి
విశాఖ జిల్లా వాకపల్లిలో గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనపై ట్రయల్ కోర్టులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించే విషయమై ఈ నెల 20వ తేదీలోగా ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ ఎం సీతారామమూర్తి విచారించారు. పిటిషనర్ల తరఫున వసుధ నాగరాజ్ వాదనలు వినిపించారు.