తెలంగాణ

వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల పెంపుదల లేనట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ విద్యుత్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎటువంటి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండానే విద్యుత్ నియంత్రణ మండలికి రూ.7611 కోట్ల రెవెన్యూలోటుతో నివేదిక ఇచ్చాయి. ఈ నివేదికలో విద్యుత్ చార్జీలను పెంచుతున్నట్లు ఎక్కడాప్రస్తావించలేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా పేర్కొనలేదు. వచ్చే ఏడాది ఎన్నికల బడ్జెట్ వస్తోంది. అలాగే 2018-19 సంవత్సరానికి విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం ఒక వేళ ఉత్పన్నమైనా, ఏ ప్రభుత్వం కూడా ఒక ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని విద్యుత్ చార్జీలను పెంచే సాహసం చేయదు. 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడం వల్ల అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు డిస్కాంలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ, పన్నుల వసూళ్లు బాగా ఉండడంతో, విద్యుత్‌చార్జీల భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్రప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం విపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సరైన ఆయుధంలేక నానా తంటాలు పడుతున్నాయి. 2018 ఏప్రిల్‌లో విద్యుత్ చార్జీలు ఏ మాత్రం పెంచినా, ప్రతిపక్షాలకు వజ్రాయుధం ఇచ్చినట్లే. అందుకే ప్రభుత్వం విద్యుత్ చార్జీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
తెలంగాణ విద్యుత్ సంస్థలు డిస్కాంలకు ఇచ్చిన నివేదికలో 2018-19 సంవత్సరానికి రూ. 35714 కోట్ల రెవెన్యూ అవసరమని అంచనా వేశాయి. విద్యుత్ కొనుగోల్లకు, ఇతర ఖర్చులకు రూ. 27,903 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశాయి. దీని వల్ల దాదాపు రూ.7613 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. గత ఏడాది కూడా డిస్కాంలు విద్యుత్ రెవెన్యూ వార్షిక నివేదికను తొలుత ఇచ్చి, టారిఫ్ ప్రతిపాదనలకు గడువును కోరాయి. ఈ సారి కూడా గడువును సాంకేతిక కారణాలపై అడిగినా, విద్యుత్ చార్జీలను ఎటువంటి పరిస్థితుల్లో పెంచేందుకు అనుమతి ఇవ్వమని రెండో సారి నివేదికను ఇచ్చే అవకాశం లేదని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. విద్యుత్ లోటు రూ.7613 కోట్లను కూడా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కుదించే అవకాశం ఉంది. సాధారణంగా విద్యుత్ నియత్రణ మండలి నివేదికను అందుకున్న వెంటనే పరిశీలించి రాష్ట్రంలో హైదరాబాద్,వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. వివిధ ప్రజా సంఘాలు, విపక్షాలు, విద్యుత్ నిపుణులు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చును. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు రోజు మాత్రమే తన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. సాధారణంగా విద్యుత్ నియంత్రణ మండలి అంతర్గత సామర్ధ్యం పెంచుకోవడం ద్వారా లోటును తగ్గిస్తుందని అంచనా. దీని వల్ల లోటు రూ.5500 కోట్లకు కుదించే అవకాశం ఉంది. ఈ మేర మొత్తం లోటును రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ ద్వారా భరిస్తుంది. రాష్ట్రప్రభుత్వం గత మూడేళ్లుగా విద్యుత్ రంగానికి సబ్సిడీలను భారీ ఎత్తున ఇస్తూ వ్యవసాయరంగం, గృహ, పరిశ్రమల రంగంపై భారం పడకుండా మంచి చర్యలు తీసుకుంటోంది. 2018-19 సంవత్సరానికి 67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని డిస్కాంలు అంచనా వేశాయి. ఇందులో 64,291 ఎంయు విద్యుత్ లభ్యత ఉండగా, అదనంగా 3282 ఎంయు విద్యుత్‌ను కొనుగోలు చేసే విధంగా ముందస్తుగా ఒప్పందాలను కూడా ఖరారు చేసుకున్నట్లు డిస్కాంలు నియ్తణ మండలికి సూత్రప్రాయంగా తెలిపాయి. గత ఏడాది విద్యుత్ కొనుగోళ్లకు రూ. 24,421 కోట్లు అంచనా వేయగా, వచ్చే ఏడాదికి రూ. 3500 కోట్లను పెంచాయి.