తెలంగాణ

ఓయు కాంట్రాక్ట్ సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ఉస్మానియా యూనివర్శిటీ బోధనేతర కాంట్రాక్ట్ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. ఒయూలో 1800 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 33 రోజులుగా నిరవధిక సమ్మె జరుపుతున్నారని, ఇటు యూనివర్శిటీ అధికారులు గానీ, అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గానీ తగు విధంగా స్పందించకపోవడం అన్యాయమని తెలిపారు. వీరికి జివో ప్రకారం కూడా జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఒయూలో రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా యూనివర్శిటీ అధికారులు తాత్సారం చేస్తున్నారని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకోవాలని కృష్ణయ్య సిఎంను కోరారు. కాంట్రాక్ట్‌లో ఉన్న కొందరు ఇప్పటికే రిటైర్‌మెంట్ రావడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఓయు హెల్త్ సెంటర్‌లో హెల్త్ కార్డులు ఇవ్వాలని, 20 క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలని, మహిళా ఉద్యోగినులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చులు యూనివర్శిటీ భరించాలని డిమాండ్ చేశారు.