తెలంగాణ

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: కాంగ్రెస్ పార్టీ ఎంతగా దుష్ప్రచారం చేసినా, రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని కట్టుకథలు చెప్పినా గుజరాత్ ప్రజలు ఆయన మాటలను నమ్మలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన సోమవారం నాడు పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఫలితాలు బిజెపి కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టిపై కాంగ్రెస్ పనిగట్టుకుని విషప్రచారం చేసినా, పటేల్ సామాజిక వర్గాన్ని లోబర్చుకోవడానికి ఎంత మాయ చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు. అంతిమంగా అభివృద్ధి కార్యక్రమాలే బిజెపిని గెలిపించాయని చెప్పారు. రాహుల్ గాంధీ గుళ్లూ, గోపురాలు తిరిగినా, ఎన్నికల్లో ప్రభావితం చూపలేకపోయాయని లక్ష్మణ్ అన్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదని ఈ ఎన్నికల ఫలితాలతో తేటతెలలం అయిందని స్పష్టం చేశారు. మునుపటితో గుజరాత్‌లో బిజెపి ఓటింగ్ శాతం పెరిగిందని, ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపును ప్రజలు సాకారం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఖచ్చితంగా ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ ,జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇక తెలంగాణలో బిజెపి బలోపేతం చేయడంపై దృష్టిసారిస్తారని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని , అలాగే మోదీ, అమిత్‌షా రాష్టప్రర్యటనలు కూడా ఖరారు చేస్తామని, ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. టిఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలన, నియంతృత్వ పోకడపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని, తెలంగాణలో రాబోయే రోజుల్లో పోలింగ్ బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు లక్ష్మణ్ తెలిపారు.
నైతిక శక్తుల విజయం: దత్తాత్రేయ
గుజరాత్ ఎన్నికల ఫలితాలు నైతిక శక్తుల విజయమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. ఈ ఫలితాలు 2019 ఎన్నికలకు ఖచ్చితంగా దిక్సూచిలా పనిచేస్తాయని అన్నారు. ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి, బిజెపికి పట్టం కట్టడం సంతోషకరమని అన్నారు. ఈ విజయం బడుగు, బలహీన వర్గాల విజయం అని ఆయన అన్నారు. కుల రాజకీయాలను గుజరాత్ ప్రజలు తిరస్కరించారని బిజెపి శాసనసభా పక్ష నేత జి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంత దిగజారుడు రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు.
చిత్రం..గుజరాత్ విజయంపై పార్టీ కార్యాలయంలో సంబురాలు చేస్తున్న బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, చింతల