తెలంగాణ

విష వాయువు లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సనత్‌నగర్, డిసెంబర్ 18: బాలానగర్ పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. బయోకెమికల్ ఇండస్ట్రీ నుంచి విషవాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. అయితే అందులోని విషవాయువు కారణంగా ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు మూసాపేట్, జనతానగర్‌కు చెందిన అల్లాడి రామారావు (50), అల్లాడి సీతారామ్(30)లుగా గుర్తించారు. అయితే వీరిద్దరు వరుసకు బాబాయ్, అబ్బాయిలని తెలుస్తోంది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని మృతుల కుటుంబాలు కోరుతున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సనత్‌నగర్ పోలీసులు తెలిపారు.