తెలంగాణ

డీజీపీతో అమెరికా కాన్సులెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. సోమవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని డీజీపీ కార్యాలయంలో వారు డీజీపీని కలుసుకుని ఇటీవల నగరంలో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సదస్సు నిర్వహణకు పోలీసులు చేసిన కృషిని వారు ప్రశంసించారు. భద్రత ఏర్పాట్లు బాగా జరిగాయని డీజీపీ మహేందర్‌రెడ్డిని వారు అభినందిస్తూ, ఒక జ్ఞాపికను బహూకరించారు. మెమెంటోకు ఒకవైపు చార్మినార్, మరో వైపు అమెరికా కాన్సులెట్ జనరల్ కార్యాలయం ఉంది. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి అమెరికా కాన్సులెట్ జనరల్, ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసిన అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా, ప్రతినిధులు