తెలంగాణ

రాజకీయ విలువలకు తిలోదకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రచారం చేస్తున్నారని గమనించిన ఆ పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి ఎల్‌కె అద్వానీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. లోగడ వాజ్‌పేయ్, అద్వానీ విలువలతో కూడిన రాజకీయం చేశారని రేవంత్ రెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా అందుకు భిన్నంగా వ్యవహారిస్తున్నందున వారితో కలిసి ప్రచారం చేయడం అవమానంగా భావించిన అద్వానీ ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎఐసిసి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లోగడ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా, సీనియారిటీకి గౌరవం ఇచ్చి మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేశారని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన గుజరాత్ రాష్ట్ర ఎన్నికల్లో సాంకేతికంగా బిజెపి గెలుపొందినా నైతికంగా తమ పార్టీ గెలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా, 50 మంది కేంద్ర మంత్రులు, 122 మంది ఎంపీలు ప్రచారం చేశారని, తమ పార్టీ తరపున కేవలం రాహుల్ ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు.
నకిలీ పాస్‌పోర్టు కేసులో అసలు నిందితులను తప్పించినందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ మహేందర్ రెడ్డికి డిజిపి పదవిని కట్టబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బిజెపి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.