తెలంగాణ

నితీష పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, డిసెంబర్ 19: నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీహెచ్.నితీష అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులు తెలిపారు. స్థానికంగా గల ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నితీష గత జనవరిలో రోజువారీలాగే స్కూల్‌కు వెళ్లగా, ప్రార్థనా సమయంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురై స్పృహతప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరీక్షలు జరిపిన వైద్యులు ఆమెకు ఊపిరితిత్తులు, గుండె పూర్తిగా చెడిపోయాయని, వాటిని మార్పిడి చేయాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబీకులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తోడ్పాటుతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవించగా, సీఎం కేసీఆర్ ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ సీఎంఆర్‌ఎఫ్ నుండి 25 లక్షల రూపాయలను మంజూరు చేశారు. అదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన అవయవాలను దానం చేయడంతో గత మార్చి 26వ తేదీన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. అనంతరం ఆరేడు మాసాల పాటు బాగానే ఉన్న నితీష, తిరిగి గత నవంబర్ 7వ తేదీ నుండి మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో యశోద ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గత డిసెంబర్ 1వ తేదీన నితీష ఆసుపత్రిలోనే తన జన్మదినాన్ని జరుపుకుంది. ప్రస్తుతం నితీష ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో ఐసీయూ వార్డులో ఉంచి చికిత్సలు చేస్తున్నారు. కోటి మందిలో ఒకరికి సోకే ఈ తరహా వ్యాధి బారినపడ్డ నితీష కేసును యశోద ఆసుపత్రి వర్గాలు సవాలుగా తీసుకుని బాలికను ఎలాగైనా కాపాడాలనే పట్టుదలతో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కృషి ఫలించి తమ బిడ్డ తమకు దక్కాలని కోరుకుంటున్నామని నితీష కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.