తెలంగాణ

భవిష్యత్తు తరాలు క్షమించవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 20: ఉనికి కోసం పాకులాడుతున్న ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుండగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు వారిని క్షమించవని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 3500 క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్, టీడీపీ చేయని అభివృద్ధి పనులను కేవలం మూడేళ్ల్ల వ్యవధిలో టీఆర్‌ఎస్ సర్కార్ వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు ఆర్థికంగా ముందుంచుతున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా తెలంగాణ సర్కార్ కులాలు, మతాలకతీతంగా అన్ని వర్గాలకు అండగా నిలుస్తుండగా, క్రిస్టియన్‌ల గౌరవం పెంచుతూ పండగను ఘనంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కొత్త బట్టలు అందించాలనే సంకల్పంతో కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని, హిందూ, ముస్లిం, క్రైస్తవులు సంతోషంగా ఉంటూ ఐకమత్యంగా మెలిగితే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అయితే గ్రామాలలో ప్రార్థనా మందిరాలు నిర్మించుకునేందుకు సర్పంచ్‌లకు అధికారం ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుండగా, గజ్వేల్‌లోని 560 సర్వే నెంబర్‌లో రూ. 30 లక్షల వ్యయంతో ఫంక్షన్‌హాల్ నిర్మాణం, 26 లక్షల వ్యయంతో క్రైస్తవ భవనం చేపట్టనున్నట్లు చెప్పారు. తూప్రాన్‌లో సైతం స్థలాన్ని కేటాయించాలని అక్కడి ఆర్డీఓ మధును ఆదేశించగా, గజ్వేల్‌లో క్రైస్తవుల సమాధుల కోసం 5 ఎకరాలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెల్తున్న టీఆర్‌ఎస్ సర్కార్‌కు అండగా నిలవాలని, గజ్వేల్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు త్వరలోనే కేసీఆర్ చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు. గజ్వేల్‌లో 100 పడకల ఆసుపత్రి, తూప్రాన్‌లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా, విదేశాలకు వెల్లే విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు సర్కార్ నిర్ణయించినట్లు చెప్పారు. మైనార్టీ గురుకులాల్లో మైనార్టీ విద్యార్థులకే కాకుండా క్రిస్టియన్‌లకు సైతం అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
80 శాతం సబ్సిడీపై క్రైస్తవులకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, ప్రజాహితమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఫుడ్ సొసైటీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు వెంకట్‌గౌడ్, చిట్టి మాదురి, పోచయ్య, రాంచంద్రం, ఎంపీపీ చిన్న మల్లయ్య, నేతలు మాదాసు శ్రీనివాస్, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.