తెలంగాణ

మరో కాశ్మీరం ఆదిలాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 20: వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి పులి వణికిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో పాటు చలి తీవ్రత విజృంభించడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు, యాచకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం జిల్లాలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం రాష్ట్రంలోనే ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం రికార్డు స్థాయిలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా బుధవారం 4.3 డిగ్రీలకు చేరుకోవడంతో డిసెంబర్, జనవరిలో మున్ముందు చలి తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ఊహించుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటల వరకు జిల్లాలో చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం 6 గంటలకే మంచు దుప్పటి కప్పేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కాశ్మీర్‌ను తలపించే రీతిలో చలి పంజా విసరడంతో ఆదిలాబాద్‌లో జనజీవనం స్తంభించిపోతోంది. లంబాడా, ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి బందోబస్తు విధుల కోసం జిల్లాకు వచ్చిన సుమారు 3 వేల మంది పోలీసులు రాత్రి వేళల్లో బందోబస్తు విధులు నిర్వర్తిస్తుంటే తమకు దేశ సరిహద్దు కాశ్మీర్ ప్రాంతం గుర్తుకు వస్తోందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మరో వారం రోజులు చలి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం నిపుణులు చెబుతున్నారు. దట్టమైన అడవులు, నల్లరేగడి భూములకు తోడు సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా విస్తరించి ఉండడం వల్లే ఆదిలాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు.
ఉదయం 6 గంటల నుండి 7.30 గంటల వరకు ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. దీంతో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే జనం చలిపులిని చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, పాలు, కూరగాయలు విక్రయించే చిరు రైతులు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో యాచకులు, వృద్ధుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అందర్నీ కలవరపెట్టిస్తోంది. మున్ముందు ఇంకా ఈ చలి తీవ్రత అధికంగా ఉంటే పాఠశాలలకు, ఆశ్రమ పాఠశాలలకు ఉదయం పూట బడి వేళలు గంటసేపు పొడిగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అత్యల్ప ఉష్ణోగ్రతలతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులు, విష జ్వరాలు, జలుబు వ్యాధులు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఉట్నూరు ఏజెన్సీ, ఆసిఫాబాద్, బోథ్ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.