తెలంగాణ

విద్యానిధి దరఖాస్తుకు మార్గదర్శకాలు జారీ జనవరి 31 వరకూ గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: విదేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఉత్తర్వులను జారీ చేసిందని, దరఖాస్తు గడువును జనవరి 31 వరకూ పొడిగించినట్టు బిసి సంక్షేమ శాఖ కమిషనర్ టి విజయకుమార్ తెలిపారు. 35 ఏళ్లు మించని వారు దరఖాస్తుకు అర్హులని, 300 మందికి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిథి కింద ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందని అందులో 15 మంది ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇస్తామని చెప్పారు. ఐదు లక్షల రూపాయిలకు మించని ఆదాయం ఉన్న కుటుంబాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, టోఫెల్‌లో 60, ఐఇఎల్‌టిఎస్‌లో 6.0, జిఆర్‌ఇలో 260, జిమ్యాట్‌లో 500, పిటిఇలో 50 కనీస స్కోర్ లేదా పర్సంటైల్ సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులని వివరించారు. పిహెచ్‌డి చేసేందుకు కూడా అభ్యర్ధులు ఈపథకం కింద దరఖాస్తు చేయవచ్చని తెలిపారు.