శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఒకే వేదికపై ఆ ఇద్దరూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేజర్ల, జనవరి 2: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5వ విడత జన్మభూమి- మా ఊరు కార్యక్రమం నిరసనలతో ప్రారంభమైంది. ప్రభుత్వ కార్యక్రమమే అయినా ఆద్యంతం అధికార తెలుగుదేశం నేతల ఆధి‘పైత్య’ ధోరణితోనే జన్మభూమి- మా ఊరు కొనసాగడం యధాప్రకారం పునరావృతం. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల మండలంలో మాత్రం ప్రశాంతంగానే కొనసాగడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలా ఎందుకంటే.. ప్రస్తుతం ప్రజాప్రతినిధి కాకున్నా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రముఖ భూమిక పోషిస్తున్నారు. ఇదే క్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుని హోదాలో మేకపాటి గౌతమ్‌రెడ్డి చేజర్ల మండల జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిరువురూ ఒకే వేదికపై దాదాపు పక్కపక్కనే ఆశీనులై ఉండటం విశేషం. చేజర్ల మండలం పెళ్లేరు, ఆదురుపల్లి గ్రామాల్లో ఇలా జరిగింది. పెళ్లేరులో ఈ ఇద్దరి నడుమ పూర్వ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పరిశ్రమల వౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ కృష్ణయ్య, ఆదూరుపల్లిలో పంచాయతీ సర్పంచు ఆశీనులయ్యారు. వీరిరువురి నడుమ ఏమైనా తూటాల్లా మాటలు రేగితే సమన్వయం చేయడానికి అలా మధ్యలో ఒకరు అని చెప్పుకోవాలి. వాస్తవ కోణంలో చూసినా అలాంటి తత్వం వీరిద్దరిలోనూ లేదనేది రాజకీయ విశే్లషణ. అయినా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు ముమ్మరంగానే ఏర్పాటు చేశారు. పెళ్లేరు జన్మభూమి ఎమ్మెల్యేకు ఓవైపు మాజీ ఐఏఎస్ కృష్ణయ్య, మరోపక్క తన వల్ల గెలిచి, పార్టీ ఫిరాయింపునకు పాల్పడి తెలుగుదేశంలో కొనసాగుతున్న జడ్పీటిసి సల్మా ఆశీనులై ఉండటం గమనార్హం. భవిష్యత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం, మేకపాటి నడుమ హోరాహోరీ పోరు జరగనుందనే చెప్పాలి. ఆత్మకూరుకు చెందిన వైరిపక్ష రాజకీయం ఇలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఆహ్వానించే రీతిలో ఉంటే పొరుగు నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో ఇటీవల జరిగిన సంఘటన ఆసక్తికరంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇదే సందర్భంలో ఉంది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి నడుమ పచ్చగడ్డి కూడా వేయకనే విభేదాగ్ని తరచూ రాజుకోవడం తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమాన్ని ప్రస్తావించుకోవాలి. అక్కడ కూడా వారిద్దరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమ వేదికపై అమాత్యులు సోమిరెడ్డి ఆశీనులయ్యారు. అదే ప్రాంగణంలోకి కాకాణి వెళ్లినా వేదికపైకి చేరలేదు. ఆ ప్రాంగణంలోనే తాను వెంట తెచ్చుకున్న మైక్‌తో ప్రసంగ పాఠం వినిపించారు. ఇదే సందర్భంలో ఆ వేదికపై ఆశీనులై ఉన్న మంత్రితోపాటు ఆయన తనయుడు, టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా రాణిస్తున్న సోమిరెడ్డి రాజగోపాలరెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీపరంగా మలచుకుంటున్నారంటూ పలు ఆరోపణల్నే సంధించారు. ఆ తరువాత సోమిరెడ్డి సైతం తన దారిలో తానూ వెళ్తూ నిత్యం సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయ విన్యాసాల్ని ఆసక్తికరమైన మలుపులు తిప్పుతుండటం అందరికీ తెలిసిందే. ఆత్మకూరు నియోజకవర్గంలో వీరిద్దరూ తారసపడ్డా ఎక్కడా వివాదానికి తావివ్వలేదు. ఇది సరికదా నియోజకవర్గ పరిధిలో ఆరు మండలాలతోపాటు ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో వేర్వేరుగా జన్మభూమి జరుగుతుండగా ఇద్దరూ ఒకేరోజున ఒకే మండలంలో జరిగిన కార్యక్రమాలకు హాజరుకావడం వల్లే రాజకీయ చర్చలకు, పోలీసుల మోహరింపు వరకు తావిచ్చినట్లైంది.
ఆదూరుపల్లిలో ఆలస్యంపై మేకపాటి అభ్యంతరం
ఇదిలాఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెళ్లేరులో కార్యక్రమం ముగియగానే ఆనం బృందం మండలంలోని తన ఉద్యానవనంలో విందుకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం నుంచి ప్రారంభం కావాల్సిన ఆదురుపల్లి జన్మభూమి ఆలస్యమైంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎమ్మెల్యే మేకపాటి అక్కడకు చేరుకుని, ఇంకా కార్యక్రమం ప్రారంభం కాకపోవడంపై తహశీల్దార్, ఎండిఓలను నిలదీశారు. వాళ్లు నీళ్లు నములుతూ ఆనం రాకకోసమై నిరీక్షిస్తున్న సంగతి చెప్పలేక చెప్పుకొచ్చారు. అలా నిరీక్షించడం తగదని, సకాలంలోనే ప్రారంభించాలంటూ హితవు పలికారు. విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తానే వచ్చినా ఇంకా జాప్యం చేయడం తగదంటూ నిలదీస్తున్న వైనంతో అధికారులు ఇక చేసేదేమి లేక ప్రారంభించారు. అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆనం కూడా కార్యక్రమంలో వచ్చి కలుసుకున్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
*మంత్రి సోమిరెడ్డి స్పష్టం
పొదలకూరు, జనవరి 2: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సూచించారు. దుగ్గుంటలో మంగళవారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు హాజరై ప్రభుత్వం చేపట్టే పథకాలను గుర్తెరగాలన్నారు. అంతేగాక వాటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అర్హులంతా సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో నీరు-చెట్టు పనులను చేపట్టి పూర్తిచేశామన్నారు. తమ ప్రభుత్వం లోటు బడ్జెట్‌తో కొనసాగుతున్నా ఇళ్లకు 24 గంటలు, వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో చంద్రన్న బీమా అమలవుతోందన్నారు. దివంగత సిఎం ఎన్టీఆర్, మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిల పుణ్యం వల్ల కండలేరు ప్రాజెక్ట్ ఆవిర్భవించిందన్నారు. కండలేరు ఎడమగట్టుకాలువపై 62కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ద్వారా చెరువులు నీటితో కళకళలాడుతున్నట్లు చెప్పారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరికీ సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కండలేరు ప్రాజెక్ట్ ద్వారా ఐదులక్షల ఎకరాలు సాగులో ఉందన్నారు. జన్మభూమి-మా ఊరులో భాగంగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు మంత్రి సోమిరెడ్డి చేతులమీదుగా జరిగాయి. అనంతరం ఆయన గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు, నెల్లూరు ఆర్డీఓ హరిత, మండల టీడీపీ అధ్యక్షులు ఎం శ్రీనివాసులురెడ్డి, విరువూరు సర్పంచు బత్తల సురేష్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నాయకులు దరిశి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు.