మహబూబ్‌నగర్

భూరికార్డుల ప్రక్షాళన 97శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 17: మహబూబ్‌నగర్ జిల్లాలో 565 రెవెన్యూ గ్రామాల్లో మార్చి 10వ తేదినాటికి అన్ని గ్రామ పంచాయతీలకు నూతన పట్టాదారు పాసుప్తుకాలు చేరుతాయని, 11వ తేదిన తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఒకే రోజు జరుగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బుధవారం బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తహశీల్దార్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మన జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన 97శాతం పూర్తి అయ్యిందనే రిపోర్టు ఇవ్వడం జరిగిందని అన్నారు. 565 రెవెన్యూ గ్రామాల్లో ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుందని అన్నారు. మార్చి 11వ తేదిన ఒకే రోజున రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పార్లమెంట్ సభ్యుడు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగేవిధంగా చూడాలన్నారు. తహశీల్దార్ దగ్గర ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. రెవెన్యూ కోర్టులో, తహశీల్దార్ కోర్టు, ఆర్డిఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టులో 3700 ఎకరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించాలని తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికార భాధ్యతలు నూతనంగా ఆమలు చేస్తున్నందున ఈ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన గదులు, కంప్యూటర్ ఇతర వౌలిక వసతులు సమకూర్చుకోవాలని వాటికి కావల్సిన నిధులు, నిధులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసి పంపినట్లు అయితే నిధులు సమకూరుస్తామన్నారు. జిల్లాలో కొత్త ఐదు మండలాలు ఏర్పడుతున్నాయని పాత తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చే ప్రజల కోసం కూర్చునేందుకు కూర్చిలు, స్ర్తి, పురుషులకు వేరువేరుగా మరుగుదోడ్లు నిర్మించాలని అన్నారు. సమావేశాలకు మీటింగ్ హళ్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మహబూబ్‌నగర్ అర్బన్, జడ్చర్ల, మక్తల్, నారాయణపేటలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయని మిగిలిన 22 మండలాల తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన శిక్షణను ఇప్పిస్తున్నామని మిగిలి ఉన్న భూరికార్డుల కేసులను వెంటనే పరిష్కారం చేసి మార్చి 11న జరిగే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ముందే భూరికార్డులలో గిట్టుబాట్లు లేకుండా సరిచేయాలని సంబందిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ బెన్‌శాలున్, సిఇఓ కోమురయ్య, ఆర్డిఓ లక్ష్మీనారాయణ, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

మా రైతులకు అన్యాయం జరిగితే సహించం
*మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి *రామన్‌పాడు షెట్టర్లను మూయించిన ఎమ్మెల్యే
ఆత్మకూరు, జనవరి 17: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానమైన రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నిరాగాతంగా నీటిని విడుదల చేస్తుండటంతో బుదవారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రాజెక్టువద్దకు చేరుకొని నాలుగు షెట్టర్లను మూయించారు. గత డిసెంబర్‌లో ఆత్మకూరు మండల సర్వసభ్యసమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జూరాల ప్రాజెక్టు ఎస్‌ఇ, సిఇలకు నీటి విడుదలను నిలిపివేయాలంటూ తీర్మానాలు పంపినప్పటికీ అధికారుల్లో స్పందన రాకపోవడంతో షెట్టర్లను బంద్ చేయించాల్సి వచ్చిందని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ, డిస్ట్రిబూటర్-6 కాలువల ఆయకట్టు రైతాంగానికి వారబంధి విధించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత 20 రోజులుగా నీటి విడుదల యధావిధిగా కొనసాగుతుండటంతో బుధవారం ఎమ్మెల్యే పెద్దఎత్తున అనుచర వర్గంతో రామన్ ప్రాజెక్టు వద్దకు చేరుకొని సిబ్బంది చేత షెట్టర్లను బంద్ చేయించారు. అనంతరం ప్రాజెక్టు ఎస్‌ఈ, సీఈలకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే సహించది లేదని, ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌కు సంబందించి ఈ ప్రాంత రైతులకు ఏప్రిల్ 10 వరకు నీటి విడుదలను కొనసాగించాలని, లేనిపక్షంలో అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. రామన్‌పాడు ప్రాజెక్టు నుండి షెట్టర్లు బంద్ చేసిన విషయాన్ని పీజేపీ ఉన్నతాధికారులకు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎమ్మెల్యే వెంట ఆత్మకూరు జడ్పీటీసీ బాలకిష్టన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేంద్రసింగ్, సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఆయకట్టు పరిధిలోని రైతులు పాల్గొన్నారు.