రాష్ట్రీయం

పెట్రోలు ధర పైపైకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పైపైకి పోతున్నాయి. లీటరు పెట్రోల్ రూ.75.47, డీజిల్ రూ. 67.09 అమలులో ఉంది. ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే 57 శాతం పన్ను చెల్లించడం వల్ల ధరలు మండిపోతున్నాయి. రోజూవారీ సమీక్షల పేరిట చేస్తున్న సవరణలతో కొన్ని పైసలు పెరగడం, తగ్గడం జరుగుతున్నది. స్వల్ప మార్పు వల్ల వినియోగదారులు దీనిని గమనించడం లేదు.
నిజానికి పెట్రోల్, డీజీల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏమైందో ఎవరికీ అంతుబట్టడం లేదు. కనీసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఎ భాగస్వామ్యపక్షాలైనా దీనిని పట్టించుకోవడం లేదు. దీంతో వినియోగదారులపై భారం పెరుగుతూనే ఉన్నది. జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్, డీజీల్ ధరలు రావడం అనేది కనుచూపులో కనిపించడం లేదు. జిఎస్‌టి పరిధిలోకి వస్తే ఈ ధరలు 50 శాతానికి తగ్గుతుందన్న ప్రచారం నాలుగైదు నెలల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వాహనదారులు ఎంతో సంతోషించారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా, వినియోగదారులకు వచ్చేసరికి ధరలు తగ్గడం లేదు. హైదరాబాద్‌లో బ్యారల్ ధర రూ.4.416 రూపాయలు. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.73, డీజిల్ ధర రూ.63 ఉండగా, ఇప్పుడు అమాంతం డీజిల్ లీటరు ధర రూ.67కు చేరింది. పెట్రోల్ ధర రెండు రూపాయలు పెరిగింది. భవిష్యత్తులో ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన పెట్రోల్, డీజిల్ డీలర్లు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది జూలై 1న డీజిల్ ధర రూ.58.09 పైసలు కాగా ప్రస్తుతం రూ.67.23. జూలై 1న పెట్రోల్ ధర రూ.66.93 కాగా ప్రస్తుతం లీటరు ధర రూ.75.47కు చేరుకుంది. ఇలాఉండగా పొరుగు రాష్టమ్రైన కర్నాటకలో పెట్రోల్, డీజిల్ లీటరు ధర రూ.5.50 వరకు తక్కువగా ఉండడంతో పటాన్‌చెరు, జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వాహనదారులు బీదర్‌కు వెళ్ళి ఖరీదు చేస్తున్నారు. ఏదేమైనా పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకుని వచ్చి ధరలు తగ్గించాలని వాహనదారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమీక్ష, సవరణల పేరిట కాలం వెళ్లబుచ్చితే ప్రజలనుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు.