మహబూబ్‌నగర్

నేరాలు అరికట్టడానికే సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 18: నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టడానికే సకల నేరస్తుల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా ప్రారంభించిన సకల నేరస్తుల సర్వే కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర రహితంగా రాష్ట్రంగా చేసి నేరాలను జీరో స్థాయికి తీసుకురావడానికి దేశచరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సకల నేరస్తుల సమగ్ర సర్వేను ప్రారంభించిందన్నారు. జిల్లావ్యాప్తంగా 14 పోలీస్ స్టేషన్‌ల్లో సుమారు వెయ్య మంది పాత నేరస్తులు ఉన్నారని, ప్రత్యేక పోలీసు బృందాలుగా ఏర్పడినట్లు గత పది ఏళ్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్‌లలో నేరాలు చేసిన నేరస్తుల జాబితా ప్రకారం వారి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు తదితర తీవ్రత గలిగిన నేరాలకు పాల్పడ్డ వారు మొదలుకుని స్వభావాన్ని మార్చుకోవడం నిరంతర నేరాలకు పాల్పడే వారి వివరాలను సమగ్రంగా సేకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నేరస్థులు, నేర ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించి జియో ట్యాగింగ్ ద్వారా నిఘాకు సన్నద్ధం చేయనున్నట్లు చెప్పారు. నేరస్తుల గత చరిత్ర, ప్రస్తుత పనుల సమాచారాన్ని, టీఎస్ కాప్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సమగ్ర సమాచారం ప్రకారం పాత నేరస్థులు ఎక్కడా ఎలాంటి నేరాలు చేసిన వెంటనే వారిని ఈ సమగ్ర సర్వే ఆధారంగా గుర్తించవచ్చని, నేరాలు అదుపుచేయడానికి సర్వే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.