కృష్ణ

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, టైపిస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జనవరి 18: పామర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈడే వీరహనుమాన్ గౌడ్‌తో పాటు టైపిస్ట్ బొమ్మారెడ్డి నాగమల్లీశ్వరి ఓ మంచి నీటి కుళాయి కనెక్షన్ మంజూరుకు రూ. 7వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థానిక చాట్లవానిపురం దళితవాడకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ నెల 3వ తేదీన మంచినీటి కుళాయి కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి ఎస్‌టీలకు పూర్తి రాయితీతో సాధారణ ఖర్చులు మాత్రమే వసూలు చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వవలసి ఉంది. అయితే సదరు సుబ్రహ్మణ్యంను కార్యదర్శి హనుమాన్ గౌడ్ రూ. 7వేలు లంచం డిమాండ్ చేసిన మాటలను ఫొన్‌లో రికార్డు చేశారు. ఫొన్ రికార్డులతో సుబ్రహ్మణ్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించటంతో తమ సిబ్బంది సహకారంతో గురువారం వల పన్ని హనుమాన్ గౌడ్‌ను సహకరించిన నాగమల్లీశ్వరిని పట్టుకున్నట్లు ఏసీబీ కృష్ణాజిల్లా డీఎసీపీ ఎస్‌వీవీ ప్రసాదరావు తెలిపారు. సుబ్రహ్మణ్యం హనుమాన్‌గౌడ్‌కు డబ్బులిస్తుండగా తనకు కాదని నాగమల్లేశ్వరి ఇచ్చి తన వద్దకు రమ్మనటంతో ఈ కేసులో నాగమల్లీశ్వరి కూడా ముద్దాయిగా చేర్చినట్లు డీఎస్‌పీ ప్రసాదరావు వివరించారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
మోపిదేవి, జనవరి 18: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 23న నిర్వహించనున్న రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసీ ఎం శారదా కుమారి, అధికారులు పరిశీలించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ మధుసూధనరావు, అర్చకులు బాలకృష్ణ శర్మ, ఫణిశర్మ, అధికారులు మల్లేశ్వరరావు, రామకృష్ణ, చెన్నకేశవ, సిబ్బంది పాల్గొన్నారు.

యాసిడ్ దాడి నిందితుల అరెస్టు
అవనిగడ్డ, జనవరి 18: స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోని మోపిదేవి దళితవాడలో బుధవారం జరిగిన యాసిడ్ దాడులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిందితులను విలేఖర్ల ఎదుట హాజరుపెట్టారు. బండి వైకుంఠరావు, బండి కిరణ్‌లను అరెస్టు చేసి అవనిగడ్డ కోర్టుకు తరలించారు. మరో నిందితుడు అరెస్టు కావల్సి ఉందన్నారు. దివిసీమలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ మూర్తి, ఎస్‌ఐ నాగేంద్రరావు పాల్గొన్నారు.