ప్రకాశం

గొట్టిపాటి ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి/సంతమాగులూరు, జనవరి 19 : అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం పాతమల్లాయపాలెంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గతంలో ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసమైంది. నియోజకవర్గంలో శుక్రవారం ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా బల్లికురవలో గొట్టిపాటి ఎన్‌టిఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించగా, ఎమ్మెల్సీ కరణం బలరాం అదేమండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఎన్‌టిఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఉదయం పాతమల్లాయపాలెంలో ఎమ్మెల్యే ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. కాగా బల్లికురవ ఎస్సై అనూక్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించారు. ప్రస్తుతానికైతే గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. శిలాఫలకాన్ని ఎవరైనా ప్రత్యర్థి వర్గాలకు చెందిన వారు ధ్వంసం చేశారా, లేక మరో కారణంచేత పడిపోయిందా అనేది పోలీసులు విచారిస్తున్నారు.
ప్రత్యర్థుల పనే : సర్పంచ్ : శిలాఫలకం ధ్వంసం వెనుక గ్రామంలోని ప్రత్యర్థుల హస్తం ఉందని గ్రామ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిలాఫలకం పడిపోవడంపై విచారణ జరిపిన బల్లికురవ ఎసై శిలాఫలకం నిర్మాణంలో గట్టిదనం లేకపోవడం వల్లనే పడిపోయినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల వాదనను సర్పంచ్ బాలకృష్ణ వ్యతిరేకిస్తూ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేర నిర్ధారణ లేకుండా కేసులు నమోదు చేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అనూక్ తెలిపారు.