ఆంధ్రప్రదేశ్‌

మీరంతా సంఘటితంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: మహిళలంతా సంఘటితంగా ఉంటూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రభ విజ్ఞప్తి చేశారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో రత్నప్రభ మాట్లాడుతూ సమాజంలో మగవారు వ్యాపారం చేసి నష్టపోతే, వారిని ఎవరూ తప్పుపట్టరు. అదే ఆడవాళ్లు వ్యాపారం చేసి, చేతులు కాల్చుకుంటే, చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆలోచన మారాలని అన్నారు.
మహిళలు ఇల్లు చక్కదిద్దడంలో సమర్థత చూపిస్తారు. సరైన అవకాశం, ప్రోత్సాహం ఇచ్చి, వ్యాపార రంగంలో వారిని దింపితే, మగవారికన్నా విజయాలను నమోదు చేస్తారని రత్నప్రభ అన్నారు. మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కోవలసి వస్తోంది. వీటిని ధైర్యంగా ఎదుర్కొంటేనే వారు ముందుకు వెళ్లగలుగుతారని ఆమె అన్నారు. పారిశ్రామికరంగంలో మహిళలు ఎదగాలంటే, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులను ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని రత్నప్రభ సూచించారు. వ్యాపారరంగానికి మహిళలు బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా విశాఖలో మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేయూతనివ్వడం ముదావహమని అన్నారు. విశాఖ ఆర్థిక రాజధాని కాబోతోందని, ఇటువంటి తరుణంలోనే మహిళలు తమకు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆమె కోరారు.
ఏడాదిలో రెండు,మూడుసార్లు మహిళా పారిశ్రామికవేత్తలు ఓచోట సమావేశమై వారి ముందున్న సవాళ్లపై చర్చించుకోవాలని, వాటిని పరిష్కరించుకునేందుకు నేరుగా ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని రత్నప్రభ సూచించారు. బ్రూనోలో మాదిరి, దేశ, విదేశాల్లో మహిళా పారిశ్రామివేత్తలు తమ ఉత్పత్తులన్నింటినీ ఒక చోటకు చేర్చి, ప్రదర్శన ఏర్పాటు చేయాలని దీనివలన తమను సుళువుగా మార్కెట్ చేసుకునే అవకాశం కలుగుతుందని రత్నప్రభ అన్నారు. కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఎంతటి ప్రతిభ కనబరుస్తున్నారో, వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కూడా మహిళలు అంతే కష్టపడాలని ఆమె కోరారు.విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ పరిశ్రమల రంగంలో కేవలం 14 శాతం మాత్రమే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని అన్నారు. ఇది మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలు మనో ధైర్యంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టినప్పుడు వారి ముందున్న అవరోథాలను సునాయాసంగా అధిగమించగలుతారని అన్నారు. మహిళా నాయకత్వం పటిష్ఠంగా ఉంటుందని అనేక సందర్భాల్లో రుజువైందని కృష్ణబాబు అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న సమావేశాలు తరచు ఏర్పాటు చేసుకోవడం వలన పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారని అన్నారు.బ్యాంకులు బడాబాబులకు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలు రుణాలు ఇవ్వడానికి అనేక సాకులు చూపుతున్నారని అన్నారు. మహిళలకు తక్కువ వడ్డీతో కోటి రూపాయల వరకూ రుణాలు ఇవ్వాలని నన్నపనేని డిమాండ్ చేశారు. మహిళలు స్థాపించే పరిశ్రమల్లో ఉద్యోగులుగా కూడా మహిళలనే అధిక సంఖ్యలో తీసుకోవాలని ఆమే సూచించారు.
చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ