బిజినెస్

శ్రీసిటీలో మరో నూతన పరిశ్రమకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, జనవరి 22: అమెరికాకు చెందిన వివిధ రకాల రుచులు, సువాసన పరిమళాలు తయారుచేసే ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెన్సన్ (ఐఎఫ్‌ఎఫ్) నూతన పరిశ్రమ నిర్మాణానికి సోమవారం శ్రీసిటీలో భూమిపూజ జరిగింది. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఐఎఫ్‌ఎఫ్ పరిశ్రమ ప్రతినిధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఐఎఫ్‌ఎఫ్ సంస్థకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద ప్లాంట్‌ను శ్రీసిటీలో నిర్మించనున్నారు. రూ.500కోట్ల పెట్టుబడులతో 32 ఎకరాల్లో స్థాపించనున్న ఈ పరిశ్రమలో సుమారు 450 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

చిత్రం..శ్రీసిటీలో ఐఎఫ్‌ఎఫ్ పరిశ్రమ స్థాపనకు భూమిపూజ చేస్తున్న దృశ్యం