ఆంధ్రప్రదేశ్‌

కొల్లేరు సమస్యను పరిష్కరించాలి: కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: కొల్లేరు అభయారణ్య పరిధిలోని మత్స్యకారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కేంద్ర మంత్రి హర్షవర్థన్‌తో రాష్ట్ర మంత్రి కామినేని ఢిల్లీలో సమావేమయ్యారు. కొల్లేరు భూముల వ్యవహారానికి సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి కామినేని విలేఖరులతో మాట్లాడుతూ పర్యావరణానికి, కొల్లేరు సరస్సు నీటి ప్రవాహానికి ముప్పు వాటిల్లకుండా సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రం సానుకులంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కొల్లేటి సరస్సు కాంటూరు పరిధి ఐదు నుంచి మూడవ కాంటూరుకు తగ్గించే అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నదని ఆయన చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు లోబడి కొల్లేరు సరస్సుపై ఆధారపడ్డ ప్రజలు జీవనోపాధి కోల్పోకుండా తగు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. ఈ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి, సొంత భూములు కలిగినవారికి ఇప్పటివరకూ ఏ విధమైన నష్టపరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో జీవనోపాధి లేక ఇప్పటికే చాలా కుంటుంబాలవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టు కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. కైకలూరు, ఆటపాక ప్రాంతాలలో ఫిబ్రవరి నాలుగో తేదీనాడు ఫెలికాన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.