బిజినెస్

పరిశ్రమలు, మార్కెటింగ్‌కు అపార అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 31: రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమలు పెట్టడానికి అనుకూలతతో పాటు విస్తారమైన మార్కెట్ అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని ఒక ప్రైవేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన పరిశ్రమల ఏర్పాటుపై పారిశ్రామిక వేత్తల కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాల తయారీకి ముందుకు వచ్చే సంస్థలకు మంచి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు తగిన విధంగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో అవగాహన కల్పించి రాష్ట్రంలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసే కంపెనీలు ఇతర రాష్ట్రాల్లోనే ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేవారికి మంచి రాయితీలు ఇస్తోందన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను అనేకవిధాలుగా అభివృద్ధి చేశారని, విభజన వల్ల హైదరాబాద్ తెలంగాణలో భాగమైందన్నారు. ఏపీకి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని అందులో సముద్రతీర ప్రాంతం, పోర్టులు తదితరమైనవని, వాటితో ఏపీని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం తమ అదృష్టమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఎప్పుడు కావాలన్నా తనతో నేరుగా మాట్లాడవచ్చన్నారు. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వివిధ పంటల సాగులో యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం ప్రాముఖ్యత ఉందని, వీటి ద్వారా అధిక దిగుబడి సాధించి రైతుకు సాగు ఖర్చు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో ఉద్యానవన పంటల విస్తీర్ణం ఉన్నదని దీనిని కోటి ఎకరాలకు పెంచే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిందు సేద్యంలో భారతదేశంలో మొదటిస్థానంలో, సూక్ష్మ నీటి సాగు పథకం విస్తీర్ణంలో రెండవ స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు కావలసిన కూలీల ఖర్చు తగ్గించేందుకు యాంత్రీకరణ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వివరించారు. అనంతపురం జిల్లా ప్లాస్టిక్ పరిశ్రమకు, కృష్ణపట్నం వ్యవసాయ యాంత్రీకరణ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమన్నారు. ఏపీ సీఐఐ చైర్మన్ జెఎస్‌ఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ ఫుడ్ ఇండస్ట్రీలో బ్రాండ్ అంబాసిడర్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ రుతుపవనాలు సమయానుకూలంగా రాకపోయినా మైక్రో ఇరిగేషన్‌తో నీటిని పొదుపుగా ఉపయోగిస్తూ సేద్యం చేసి పంటలు పండించవచ్చని, ఇందులో ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ముందుగా ఎంటర్ ప్రెన్యూర్స్‌తో కలిసి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉద్యాన పరిశ్రమలపై ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల శిబిరం 2018 కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ మరియు సూక్ష్మ సాగు నీటి పరికరాల తయారీ కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.