రాష్ట్రీయం

థర్డ్ ఫ్రంట్‌కు లీడర్‌నవుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: భారతదేశ రాజకీయాల్లో మార్పుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవసరమైతే థర్డ్‌ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానని తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో శనివారం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశాన్ని శాస్ర్తియంగా అభివృద్ధి మార్గాన నడిపించడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పథకాల పేర్లు మార్చి కొనసాగించారే తప్ప, కొత్తదనమంటూ ఏమీ లేదని విమర్శించారు. ఈ పరిస్థితిలో దేశరాజకీయాల్లో సమూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏ రాజకీయ పార్టీతోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్ అవసరం ఎంతైనా ఉందని, అది థర్డ్‌ఫ్రంట్ కావచ్చు లేదా మరో కూటమి కావచ్చన్నారు. పరిస్థితులను అనుసరించి ఫ్రంట్‌కు నాయకత్వం వహించేందుకూ సిద్ధంగా ఉంటానన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ‘నోకాన్ఫిడెన్స్ మోషన్’ పెట్టడమన్నది ‘చీప్ పొలిటికల్ స్టంట్’ అని వ్యాఖ్యనించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు చేయాలంటూ కేంద్రానికి అనేకసార్లు దరఖాస్తులు ఇచ్చామని కేసీఆర్ గుర్తుచేశారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ గుణాత్మక మార్పులు రాలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, రాజ్యాంగానికి అనుగుణంగా నిధులిచ్చి తీరాల్సిందేనని అన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణకు 81,362 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. మిషన్ భగీరథ కోసం 18 వేల కోట్లు, మిషన్ కాకతీయ కోసం 5 వేల కోట్లు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ, కేంద్రం ఒక్క రూపాయి కూడా విదల్చలేదని గుర్తు చేశారు. ఈ విషయాలు బీజేపీకి చెందిన రాష్ట్ర నేతలు గుర్తించాలన్నారు. పార్లమెంట్ సభ్యులు, రాష్టమ్రంత్రులు కూడా కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చించినా, చెప్పుకోదగ్గ స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సాచివేత ధోరణి కనబరుస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్టల్రో 52 శాతం, తమిళనాడులో
69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచాలని కోరామన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్చ ఉండాలని, కేంద్రం పెత్తనం తగదన్నారు. దీనిపై అవసరమైతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ల హెచ్చింపుపై అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయవచ్చని సుప్రీంకోర్టు కూడా పేర్కొన్నదని, ఆర్టికల్ 16ను సవరించవచ్చన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి లోబడి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వలేదన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణ, ఏపీలకూ ఇనె్సంటివ్ ఇచ్చినట్టయితే పెట్టుబడులు మరిన్ని ఎక్కువగా వచ్చి ఉండేవన్నారు. ఇనె్సంటివ్ లభిస్తే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉండేదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఈ అంశాలను అమలు చేయాలని పోరాటం చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ పనులకు జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని కేసీఆర్ కోరారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారన్నారు.