ఆంధ్రప్రదేశ్‌

యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ప్రేమను తిరస్కరించినందుకు ఓ యువతిపై ఇద్దరు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటర్ వరకూ చదివి, ఇంటిపట్టునే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా ప్రేమపేరిట ఆమెను వేధిస్తున్నాడు. అయితే, ఆమె అందుకు తిరస్కరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ఆ యువకుడు తన మిత్రుడితో కలిసి ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. మంటల్లో గాయపడిన యువతిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.