మహబూబ్‌నగర్

పేపర్ లీక్ కలకలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 19: మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఇంగ్లీష్ పేపర్-1 ప్రశ్నపత్రం లీక్ కావడంతో జిల్లాలో కలకలం రేగింది. మరికల్ పట్టణంలోని రెండు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నిర్వాకం కారణంగా దాదాపు మహబూబ్‌నగర్ జిల్లాలోని 20వేల మంది విద్యార్థులు కలవారానికి గురయ్యారు. ప్రశ్నపత్రం లీక్ కావడంతో ప్రస్తుతం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తారా లేక ప్రస్తుతం రాసిన పరీక్షను యదాతథంగా ఉంచుతారా అనే ఆందోళన అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులలో పలు అనుమానలను రేకెత్తిస్తున్నాయి. అయితే డిఇఓ సోమిరెడ్డి మాత్రం సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాత్రం ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని కానీ ఆ సెంటర్‌లో ఎలాంటి మాస్ కాపీయింగ్ మాత్రం జరగలేదని వెల్లడించారు. అయితే పేపర్‌ను లీక్ చేసిన నవీన్ తన ఫోన్‌లో వాట్సాప్ ద్వారా ఎవరేవరికి పంపించారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నవీన్‌తో పాటు విద్యార్థి హరీష్, మరో ముగ్గురు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆత్మకూర్, వనపర్తితో పాటు ఇతర ప్రాంతాలకు వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తుంది. రాష్టస్థ్రాయిలో ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం జిల్లా అధికారులు పంపించే నివేదిక ఆధారంగా ఇంగ్లీష్ పేపర్-1 యధాతథంగా ఉంటుందో లేక తిరిగి మరోసారి పరీక్ష నిర్వహిస్తారోనని ఆందోళన మాత్రం విద్యార్థుల్లో నెలకొంది.

పోలీసు బందోబస్తుపై అనుమానాలు
* 144సెక్షన్ ఆమలులో ఉండగా లీక్ ఎలా...?
పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ విధించినట్లు ఇదివరకే జిల్లా ఎస్పీ అనురాధ ప్రకటించగా జిల్లా వ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాల దగ్గర 144సెక్షన్ ఆమలులో ఉంది. అయితే ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర పోలీసు బందోబస్తు ఉంది. మరికల్ జిల్లా పరిషత్ బాలికల పరీక్ష కేంద్రం దగ్గర పోలీసు బందోబస్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసుల బందోబస్తు, 144సెక్షన్ ఆమలులో ఉండగా ఓ యువకుడు అంత ధైర్యంగా ప్రహారీగొడ దూకి ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడం ఏమిటని అందరిలో పోలీసు బందోబస్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఉండగా నవీన్ అనే యువకుడు పరీక్ష కేంద్రం దగ్గరకు ఎలా వెళ్లాడని విమర్శలు వెలువడుతున్నాయి. ఈవిషయంపై సోమవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఎస్పీ అనురాధను ఆంధ్రభూమి ప్రతినిధి ప్రశ్నించగా పోలీసు బందోబస్తుపై కూడా ఆరా తీస్తున్నామని పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని ఎస్పీ వెల్లడించారు.

పేపర్ లీక్ సూత్రదారులపై కఠిన చర్యలు
* ఐదుగురి అరెస్టు.. ముగ్గురు అధికారులపై వేటు
* మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ
జిల్లాలోని మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష పత్రం-1 లీక్‌కు కారకులైన సూత్రదారులను ఎవరిని వదిలేది లేదని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ హెచ్చరించారు. మరికల్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రంలో సోమవారం ఓ విద్యార్థి పరీక్ష పత్రాన్ని బయటకు లీక్ చేశాడు. ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఉన్నతాధికారులు లీక్‌కు కారకులైన వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాద, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరావు, జిల్లా విద్యాధికారి సోమిరెడ్డిలు కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ మరికల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ పేపర్ లీక్‌కు కారకులైన నవీన్, మోహన్, రాజేందర్, ప్రవీణ్, విద్యార్థి హరిష్‌ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. పరీక్ష కేంద్రం దగ్గర అన్ని విధాలుగా విచారణ చేపట్టామని విధులు నిర్వహిస్తున్న ఇన్వీజిలేటర్లను సైతం విచారిస్తామని తెలిపారు. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు పరీక్ష కేంద్రం దగ్గరకు వచ్చి ప్రహారీ గొడ దూకి పరీక్ష రాస్తున్న హరీష్ అనే విద్యార్థితో పేపర్‌ను లీక్ చేయించుకున్నాడని తెలిపారు. విద్యార్థి హరీష్ నవీన్‌కు కిటికిలో నుండి ఇంగ్లీష్ ప్రశ్నపత్రాన్ని బయటకు విసిరేశాడు. దానిని తీసుకున్న నవీన్ అనే యువకుడు తన సెల్ ఫోన్ ఫోటోలు తీసుకుని తిరిగి ప్రశ్న పత్రాన్ని విద్యార్థికి ఇచ్చేశాడు. అయితే నవీన్‌ను ప్రశ్నపత్రం లీక్ చేయడానికి మరికల్‌లోని ప్రతిభ హైస్కూల్, గౌతమి స్కూల్ యజమాన్యమే కారణమని తెలిపారు. నవీన్ ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసుకువచ్చి పిఇటిగా ప్రవీణ్, ప్రతిభ హైస్కూల్‌లో పిఇటిగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మోహన్, గౌతమ్ మాడల్ స్కూల్ కరస్పాండెంట్ రాజేందర్‌లకు లీక్ అయిన ప్రశ్నపత్రాన్ని ఫోన్‌లో నుండి వాటాప్స్ ద్వారా వీరందరికి సమాచారం ఇచ్చారని తెలిపారు. 21 జిరాక్స్ కాఫీలను తయారు చేసి ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి ప్రశ్నలకు, జవాబులను కూడా తయారు చేశారని తెలిపారు. నవీన్ వీరికేకాకుండా తనకు కావల్సిన వారికి వాటాప్స్ ద్వారా ప్రశ్నపత్రాన్ని సమాచారం చేరవేసినట్లు ఉందని అన్నారు. అయితే ఇంతలోనే నవీన్ దగ్గర ఉన్న పోన్ బాలకృష్ణది కావడంతో ఆయన తన పోన్ ఇవ్వాలని కోరగా ఆ పోను ఆయనకు ఇచ్చేశాడని వెల్లడించారు. విషయం బయటకు పొక్కడంతో హుటాహుటిన తాము రంగంలోకి దిగామన మక్తల్ సిఐ వెంకటేశ్వర్లును అక్కడికి పంపించి పేపర్ లీక్‌కు కారకులైన వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంకట్‌రావు మాట్లాడుతూ పరీక్ష పేపర్‌ణ లీక్ అయిన విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ఆదేశాల మేరుకు ఐదుమంది బృందాన్ని మరికల్ పరీక్ష కేంద్రానికి పంపించి విచారించామని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకమని అన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో కానీ తాము పేపర్ లీక్ అయిన విషయాన్ని మాత్రం క్షుణంగా నివేధిక పంపడం జరుగుతుందని అన్నారు. డిఇఓ సోమిరెడ్డి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ ఆర్.చంధ్రశేఖర్‌రెడ్డి, డిపార్టుమెంటల్ అధికారి వి.రాజశేఖర్‌రెడ్డి, ఇన్విజిలేటర్ కె.వెంకటయ్యలను సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా గౌతమ్ మాడల్‌స్కూల్, ప్రతిభ హైస్కూల్‌ల గుర్తింపులను కూడా రద్దు చేయడానికి రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా విచారణ చేస్తున్నామని అన్ని విషయాలను మరింత ఒకటి రెండు రోజుల్లో వెల్లడించడం జరుగుతుందని తెలిపారు.