విజయనగరం

తామరకొండ గ్రానైట్ తవ్వకాలకు భూమి పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, మార్చి 23: మండలంలో తామరకొండ గ్రానైట్ తవ్వకాలకు శుక్రవారం లీజు అనుమతులు పొందిన యజమాని దొంగచాటుగా భూమి పూజ చేశారు. ఈ భూమి పూజను అడ్డుకునేందుకు పరిసర గ్రామాలైన సన్యాసిరాజుపేట, బర్నికవలస, మూలవలస, సీతందొరవలస, వల్లాపురం, మూలవలస గ్రామాల గిరిజనులు భారీ సంఖ్యలో తామరకొండ వద్దకు చేరుకున్నారు. తామరకొండ, పోలిమెట్ట, దుక్కడమెట్ట గ్రానైట్ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మర్రి శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకులు కె చినబాబుల ఆధ్వర్యంలో గిరిజనులంతా కర్రలు, గొడ్డళ్లు, కత్తులను పట్టుకుని అడ్డుకునేందుకు బయలుదేరారు. ఈమేరకు ఏఎస్పీ దీపిక పాటిల్, పార్వతీపురం సీఐ రాంబాబుల ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి భూమి పూజకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. అడ్డుకునేందుకు వెళుతున్న మహిళలు, గిరిజన యువకులను ఏమార్చి వారి సమస్యలను వింటున్నట్లు అధికారులు, పోలీసులు నటించారు. ఈలోగా రహస్యంగా భూమి పూజ చేసి యజమాని అడ్డుత్రోవలో పలాయనం చిత్తగించారు. అనంతరం తామరకొండ చుట్టు ఉన్న గ్రామాల గిరిజనులు అక్కడకు చేరుకుని భూమి పూజ చేసిన స్థలంలో ఆందోళనలు చేశారు. తామరకొండ తవ్వకాలను ప్రారంభిస్తే ప్రాణాలకు తెగించి అయిన అడ్డుకుంటామని గిరిజనులు హెచ్చరించారు. పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొండచుట్టు ఉన్న గిరిజన గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందన్నారు. ఇక్కడ తవ్వకాలు చేస్తే 1000 ఎకరాల పంట భూములు నాశనమవుతాయన్నారు. 15 గ్రామాల ప్రజలు జీవనాధారం కోల్పోతారన్నారు. కొండపై పడిన వర్షాలు వాగులు, వంకల ద్వారా చెరువుల్లోకి చేరుతుంది. ఆ నీటితో పంటలను సాగుచేస్తున్నామన్నారు. గొర్రెలు, మేకలు, పశువులను కొండలపై మేపుకుంటూ ఎంతోమంది గిరిజనులు జీవనం సాగిస్తున్నామన్నారు. అనంతరం గిరిజనులంతా సన్యాసిరాజుపేట చేరుకుని మక్కువ-సాలూరు రహదారిపై సుమారు 4గంటల పాటు రాస్తారోకో చేశారు. రహదారికి అడ్డంగా చెట్టు కొమ్మలు, కలపదుంగలు వేసి నిరసన వ్యక్తం చేశారు. పరిరక్షణ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు, వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రహదారి దిగ్భందం చేశారు. రహదారికి ఇరువైపులా బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఆందోళనను విరమించేది లేదని 4గంటలపాటు గిరిజనులు రోడ్డుపై భైఠాయించారు. మధ్యాహ్నం 2గంటలకు తహశీల్దార్ ఆర్ కృష్ణంరాజు, రామభద్రపురం ఎస్ ఐ డీడీ నాయుడులు సన్యాసిరాజుపేటకు చేరుకుని ఆందోళనదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని వారు తెలిపారు. తహశీల్దార్ మాట్లాడుతూ 2015లో తామరకొండ గ్రానైట్ కొండల తవ్వకాల అనుమతులకు దరఖాస్తులు చేశారని, ఇందుకు ప్రభుత్వం అనుమతి జారీచేసిందని, తమకు సంబంధం లేదన్నారు. గత ఏడాదిగా అనేకపర్యాయాలు తవ్వకాలకు లీజు అనుమతులు ఇవ్వవద్దని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని కమిటీ నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావులు తెలిపారు. ప్రజల వ్యతిరేకతను ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ప్రజావ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేశానని తహశీల్దార్ తెలిపారు. గిరిజనులకు సమస్యలుంటే తెలియజేస్తే కలెక్టర్‌కు నివేదిస్తానని హామీ ఇచ్చారు. కొండచుట్టు ఉన్న గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని శ్రీనివాసరావు, ఈశ్వరరావులు డిమాండ్ చేశారు. గిరిజనుల ఆవేదన, అభిప్రాయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తహశీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు.

కాగిత రహిత పాలన విధానం తప్పనిసరి

పార్వతీపురం, మార్చి 23: కాగిత రహిత ఆర్థిక లావాదేవీలు వచ్చేనెల 1 వతేదీ నుండి రాష్ట్రంలో అమలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నందున దీనిపై ప్రతి ఉద్యోగికి అవగాహన ఆవశ్యమని పార్వతీపురం ఆర్డీవో బి సుదర్శనదొర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశం హాలులో బొబ్బిలి, తెర్లాం, కురుపాం ఖజానా పరిధిలోని గల డిడివోలకు, ఇతర ఉద్యోగులకు కాంప్రహెన్షివ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సి ఎఫ్ ఎం ఎస్) విధానం అమలుకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ కాగిత రహిత విధానం వల్ల కలిగే ప్రయోజనం భవిష్యత్తులో ఎంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యాలయ బిల్లులు ఇతర అంశాలలో ఈవిధానం అమలుకు నిర్వహించే అవగాహన సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సహాయ ఖజానాధికారి నాయుడు జగన్నాథం మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరించనున్న సి ఎఫ్ ఎం ఎస్ విధానంపై పూర్తిస్థాయి అవగాహనకు పలు అంశాలను ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం తహశీల్దారు అజురఫీజాన్, ఎపి ఎన్ జివో అసోసియేషన్ నాయకుడు జి వి ఆర్ కిశోర్, పార్వతీపురం ఖజానాధికారి జయకుమార్, కురుపాం ఎస్‌టివో శ్రీనివాసరావు,బొబ్బిలి ఎస్‌టివో వెంకట్రావు, తెర్లాం ఎస్‌టివో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.