బిజినెస్

పనస నుంచి వైన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: పసందైన పనస నుంచి వైన్ తయారు చేయాలని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన జీసీసీ బ్రాండ్‌తోనే పనస వైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. అయితే, దీనికంటే ముందు నిపుణులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా జీసీసి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యంగా పనస ద్వారా వైన్‌ను తయారు చేసే ప్రక్రియపై మైసూర్‌లో ఉన్న ఫుడ్ సేఫ్టీ రీసెర్చ్ సెంటర్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎంత మోతాదులో మత్తు(ఆల్కాహాల్) ఉండాలి? ఇందులో ఏఏ రసాయనాల మిశ్రమం ఉండాలి? జీసీసీ బ్రాండ్‌తో తయారయ్యే పనస వైన్ ఉత్పత్తి కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి? అనే అంశాలపైన పరిశోధనలు జరుగుతున్నట్టు తెలిసింది. ఇది పూర్తయి ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే జీసీసీ బ్రాండ్‌తో కూడిన పనస వైన్‌ను ప్రయోగాత్మకంగా మార్కెట్‌లోకి విడుదల చేయాలని యాజమాన్యం ఆలోచన చేస్తోంది. ముందుగా పనస పంట అత్యధికంగా పండే గిరిజన ప్రాంతాలపైన దృష్టిసారిస్తోంది. ఏపీలో విశాఖ జిల్లాకు సంబంధించి చింతపల్లి, లంబసింగి, పాడేరు, సీలేరు, అరకు, ముంచింగపుట్, అనంతగిరి ప్రాంతాల్లో పనస పంట దిగుబడి అయ్యే ప్రాంతాలుగా జీసీసీ ఇప్పటికే గుర్తించింది. అలాగే వీటితోపాటు విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం సీతమ్మపేట ఏజేన్సీ ప్రాంతాల్లో పనస పంట దిగుబడి అధికంగా ఉంటుందనేది తేలింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలపైన జీసీసీ దృష్టిసారిస్తోంది. పనసపండ్లను గిరిజన రైతుల నుంచి సేకరించి తొనల ద్వారా వైన్ తయారు చేసే ప్రయోగానికి త్వరలో శ్రీకారం చుట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ విధానం వలన గిరిజన రైతులకు పనసకు గిట్టుబాటు ధర కల్పించినట్టు అవుతుంది. మరో విధంగా దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించగలమని జీసీసీ విశ్వసిస్తోంది. ఇప్పటికే అరకుకాఫీకి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు లభించడంతోపాటు ఇదే తరహాలో దేశంలో మరెక్కడా లేనివిధంగా పనస తొనల నుంచి వైన్ తయారు చేసే తొలి ప్రయోగానికి సంస్థ నాంది పలికాలని ఆలోచన చేస్తోంది.